నిబద్ధత, అంకితభావంతో పనిచేయాలి
ములుగు: మేడారం మహాజాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబద్ధ త, అంకితభావంతో పనిచేసి మేడారం జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ పి లుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఎల్‌ఆర్ గార్డెన్‌లో మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు విధులు నిర్వహించే సెక్టోరల్ అధికారులు, సిబ్బందికి రెండో విడత శిక్షణా కార్యక్రమాన్ని ఇచ్చారు. కార్యక్రమానికి కలెక్టర్ దివాకర హాజరై మాట్లాడారు. జాతరలో విధులు నిర్వహించే అధికా రులకు శిక్షణ ముగిసిందని, జాతర విధుల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉండాలన్నారు. జంపన్నవాగు వ ద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. జాతర పరిసరాల్లో భక్తులకు అర్థమయ్యేలా ఆర్‌అండ్‌బీ శాఖ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పరిసరాలు దుర్వాసన రాకుండా ఎప్పటికప్పుడు గల్ఫర్‌తో శుభ్రం చేస్తుండాలని, పారిశుద్ధ్య సిబ్బందికి యూనిఫాం, గ్లౌస్‌లు, మా స్కులు ఇవ్వాలన్నారు. ఆరోగ్య పరంగా మందులు అందుబాటులో పెట్టుకొని సిద్ధంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆలయ అలంకరణ, లైటింగ్, పరిసరాలు గిరిజన సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం జాతర నిర్వహించాలన్నారు. సెక్టార్ అధికారుల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం అధికారులకు జాతర విధులకు సంబంధించి ప్రత్యేక గుర్తింపు కార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, నోడల్ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.
26న అధికారులు రిపోర్ట్ చేయాలి
కలెక్టర్ దివాకర టీఎస్
ముగిసిన సెక్టోరల్ అధికారుల శిక్షణ


