ప్లాస్టిక్ రహిత మేడారమే లక్ష్యం
ములుగు రూరల్: ప్లాస్టిక్ రహిత మహాజాతరగా నిర్వహించుకునేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాఽథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మేడారం జాతరలో వినాయక గ్రామైక్య సంఘం జగ్గన్నపేట ఆధ్వర్యంలో ఆకులతో తయారు చేసిన ప్లేట్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకృతి ప్రసాదిస్తున్న ఆకుల తయారీ విస్తరాకులను వినియోగించడం మేలన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్స నరసింహమూర్తి, జిల్లా సమాఖ్య మేనేజర్ కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


