రామప్పలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రమేశ్
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు రమేశ్ గురువారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఆయన వెంట ములుగు ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి కోటి ఉన్నారు.
కాళేశ్వరం: గతేడాది మేలో సరస్వతి నది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని వీఐపీ ఘాటు వద్ద ఏర్పాటుచేసిన సరస్వతి మాత విగ్రహానికి దేవస్థానం అర్చకులు ముస్తాబు చేస్తున్నారు. శుక్రవారం వసంతపంచమి సందర్భంగా దేవస్థా నం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు వసంత పంచమి..
వసంత పంచమి సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీసరస్వతి అమ్మవారి ఆలయంలో ఉదయం 10గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. చిన్నారులకు అక్షర స్వీకారాలు చేస్తారు. భక్తులు పాల్గొనాలని దేవస్థానం అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ 9వ సమావేశం నిర్వహించనున్నట్లు హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ విభాగం అధిపతి డాక్టర్ చిలువేరు రాజ్‌కుమార్ తెలిపారు. ఈమేరకు క్యాంపస్‌లో గురువారం పోస్టర్‌ను వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్, ఆచార్యులు బి.సురేశ్‌లాల్, ఆర్.మల్లికార్జున్‌రెడ్డి, చంద్రకళ, వీఎస్ నరేందర్, కుమారస్వామి, ఎంకే సుమంత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఏటూరునాగారం: 800 ఏళ్ల చరిత్ర కలిగిన మేడారం జాతరపై ప్రముఖ రచయిత, ఎన్‌ఐటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు రచించిన సమ్మక్క–సారలమ్మ పుస్తకాన్ని మంత్రి సీతక్క గురువారం ఆవిష్కరించారు. మేడారంలోని ఐటీడీఏ గెస్ట్ హౌస్‌లో కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణిలతో కలిసి మంత్రి సీతక్క ఆవిష్కరించారు. అనంతరం వనదేవతలను దర్శనం చేసుకుని వారు రచించిన పుస్తకాన్ని గద్దెల వద్ద సమర్పించారు.
రామప్పలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రమేశ్
రామప్పలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రమేశ్
రామప్పలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రమేశ్


