చట్టాలపై అవగాహన తప్పనిసరి
వెంకటాపురం(ఎం): ప్రతిఒక్కరూ చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్యర్యంలో శ్రీచైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్‌శ్రీ ప్రచారంలో భాగంగా మండలంలోని పాలంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివాహ నిషేధిత చట్టం, పోక్సో చట్టం, విద్యా హక్కు చట్టం, ర్యాగింగ్ చట్టం, మోటార్ వెహికల్ చట్టం గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాల్య వివాహం చేస్తే చట్టరీత్యా నేరమన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే సమాచారం ఇవ్వాలన్నారు. ఉచిత న్యాయ సహాయానికి టోల్ ఫ్రీ నంబర్ 15100 కి కాల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్‌న్స్ కౌన్సిల్ బానోత్ స్వామి దాస్, ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్, ఉపాధ్యాయులు అనిత, రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్
మహేందర్


