అందరికీ ఒకేరకమైన ఆహారం
● ఎస్పీ సుధీర్ రాంనాథ్‌కేకన్
ములుగు రూరల్: ఆహార నాణ్యతలో తేడా వస్తే వేటు తప్పదని, హోంగార్డు నుంచి ఎస్పీ స్థాయి వరకు అందరికీ ఒకే రకమైన ఆహారం అందించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సూచించారు. ఈ మేరకు నార్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడారం సిబ్బందికి వండుతున్న భోజనాన్ని ఎస్పీ గురువారం పరిశీలించి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మేడారంలో అన్ని ర్యాంకుల అధికారులు, సిబ్బందికి నాణ్యమైన ఆహారం అందేలా చూడాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బందికి ఆరోగ్యం, భద్రత అత్యంత ముఖ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ శివం ఉపాధ్యాయ, ఏఎస్పీ మనన్ బట్, ఎస్‌బీ సీఐ శంకర్, ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ ఒకేరకమైన ఆహారం


