గట్టమ్మకు ఎదురుపిల్ల పండుగ
బోనాలతో ఆలయానికి వస్తున్న ఆదివాసీ నాయకపోడులు
ములుగు రూరల్: మేడారం సమ్మక్క –సారలమ్మ జాతరకు అనుగుణంగా ఆదిదేవత గట్టమ్మతల్లికి ఆదివాసీ నాయకపోడులు బుధవారం ఎదురుపిల్ల పండుగను ఘనంగా నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. గట్టమ్మ ఆలయ పూజారులు అటవి ప్రాంతంలోని పూర్వపు గట్టమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీ నాయకపోడు సంస్కృతి, సాంప్రదాయాల మేరకు గట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పుసుపు–కుంకుమ, కొబ్బరికాయలు కొట్టి, యాటపోతులను బలిచ్చారు.
భారీగా తరలివచ్చిన ఆదివాసీలు
గట్టమ్మతల్లికి ఎదురుపిల్ల పండుగ సందర్భంగా ఆదివాసీ నాయకపోడులు భారీగా తరలివచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ నాయకపోడ్ కమ్యూనిటీహాల్ నుంచి గట్టమ్మ ఆలయం వరకు పూజారుల ఆధ్వర్యంలో డోలి వాయిద్యాల నడుమ భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా పోలీసులు వన్ వే ఏర్పాటు చేసి భక్తుల వాహనాలను తరలించారు. ఎదురుపిల్ల పండుగ సందర్భంగా శివసత్తుల పూనకాలు, లక్ష్మీదేవర నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
101 బోనాలతో నైవేద్యం
ఎదురుపిల్ల పండుగ సందర్భంగా ఆదిదేవత గట్టమ్మ తల్లికి ఆదివాసీ నాయకపోడులు, పూజారులు బోనాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఆలయ ప్రధాన పూజారి కొత్త సదయ్య ఆధ్వర్యంలో అమ్మవారికి ౖనైవేద్యం సమర్పించారు. అనంతరం అమ్మవారికి యాటపోతుల మొక్కులను సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన సమ్మక్క –సారలమ్మ గద్దెలకు పూజారులు పసుపు–కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్త లక్ష్మయ్య, పూజారులు అరిగెల సమ్మయ్య, కొత్త రాజేశ్, రాజ్‌కుమార్, నరేశ్, ఆకుల రఘు, రవి, నీలయ్య, సుభద్ర, మహేందర్, సంతోష్‌లతో పాటు 500 మంది పాల్గొన్నారు.
గట్టమ్మ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలి. జిల్లా కేంద్రానికి చెందిన సుమారు 100 కుటుంబాలు గట్టమ్మ తల్లి ఆలయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. అమ్మవారి ఆలయంలో రోజు వారీగా భక్తులకు సేవలు అందిస్తున్నాం. ఆలయ ఆదాయం ఆదివాసీ నాయకపోడ్‌లకు చెందే విదంగా చర్యలు తీసుకోవాలి.
– కొత్త సురేందర్, ఆదివాసీ
నాయకపోడు సంఘం జిల్లా అధ్యక్షుడు
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా ఆదిదేవత గట్టమ్మ తల్లికి మొదటి మొక్కులు చెల్లిస్తాం. ఆదివాసీ నాయకపోడ్ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తాం. గట్టమ్మతల్లికి తొలి బోనం సమర్పించడం ఎంతో ఆనందంగా ఉంది.
– కొత్త సదయ్య,
గట్టమ్మ ఆలయ ప్రధాన పూజారి
●
భారీగా తరలివచ్చిన
ఆదివాసీ నాయకపోడులు
లక్ష్మీదేవర నృత్యాలు, శివసత్తుల పూనకాలు
గట్టమ్మకు ఎదురుపిల్ల పండుగ
గట్టమ్మకు ఎదురుపిల్ల పండుగ
గట్టమ్మకు ఎదురుపిల్ల పండుగ
గట్టమ్మకు ఎదురుపిల్ల పండుగ
గట్టమ్మకు ఎదురుపిల్ల పండుగ


