గోవిందరాజుల గుడిలో మండమెలిగె పూజలు | - | Sakshi
Sakshi News home page

గోవిందరాజుల గుడిలో మండమెలిగె పూజలు

Jan 22 2026 7:23 AM | Updated on Jan 22 2026 7:23 AM

గోవిం

గోవిందరాజుల గుడిలో మండమెలిగె పూజలు

గోవిందరాజుల గుడిలో మండమెలిగె పూజలు కొబ్బరికాయలు తగిలి భక్తులకు గాయాలు చలివేంద్రాల ఏర్పాటు మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌ బదిలీ

ఏటూరునాగారం: మండల పరిధిలోని గోవిందరాజుల ఆలయాన్ని శుద్ధి చేశారు. మేడారం మహాజాతరలో భాగంగా ఈ నెల 28వ తేదీన గోవిందరాజులు కొండాయి నుంచి మేడారం చేరుకుంటారు. ఇందులో భాగంగానే బుధవారం మండమెలిగె కార్యక్రమాన్ని చేపట్టి ఆలయంలోని ఆడెరాలు, బూర, గంటలు, మువ్వలు, ఇతర పూజా సామగ్రిని శుద్ధి చేశారు. అనంతరం ఆడెరాలను కుంకుమ, పసుపుతో అలంకరించి దూపం దీపంను పూజారులు దబ్బగట్ల గోవర్ధన్‌, నాగేశ్వర్‌రావు, రాజారాం, బాబులు సమర్పించారు. అలాగే నాగులమ్మ గుడిలో సైతం పూజలు నిర్వహించారు. గ్రామంలోని ఆడ పడుచులు గుడికి చేరుకొని గుడి ఆవరణ శుభ్రం చేశారు. యువకులు మామిడితోరణాలను కట్టి అలంకరించారు. అలాగే చెట్టు కింద ఉన్న ఇతర దేవతల విగ్రహాలను సైతం శుభ్రం చేశారు.

ఎస్‌ఎస్‌ తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లిస్తున్న భక్తులకు కొబ్బరికాయలు తగిలి పలువురు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం గద్దెల ప్రాంగణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..భక్తుల రద్దీ పెరగడంతో గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. గద్దెల గ్రిల్స్‌ బయట నుంచి మొక్కులు చెల్లించుకునేందుకు గద్దెలపైకి కొబ్బరి కాయలు, బెల్లం విసరడంతో అవి తగిలి పలువురికి గాయాలయ్యాయి. స్పందించిన రెస్క్యూ టీం బృందాలు గాయపడిన భక్తులను టీటీడీ కల్యాణ మండపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల దాహం తీర్చేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం మేడారంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. జాతరలో ఆ శాఖ తరఫున తాగునీటి కోసం బ్యాటరీ ఆఫ్‌ ట్యాప్స్‌, మినీ వాటర్‌ ట్యాంకులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు జాతరలో 15 ప్రాంతాల్లో చలి వేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్లు డీఈ సునీత తెలిపారు. చలి వేంద్రాలతో పాటు బ్యాటరీ ఆఫ్‌ ట్యాప్‌ నల్లాల ద్వారా కూడా భక్తులకు తాగునీటిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. భక్తులు చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ములుగు: ములుగు మున్సిపల్‌ కమిషనర్‌ జంగిలి సంపత్‌ బదిలీ ఆయ్యారు. 2025 జూన్‌ 25న ములుగు మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంపత్‌ 7 నెలల పాటు బాధ్యతలు నిర్వహించారు. మున్సిపల్‌ ఎన్ని కల ముందు కమిషనర్ల బదిలీల్లో భాగంగా సంపత్‌ను బెల్లంపల్లి మున్సిపల్‌ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. బెల్లంపల్లి మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న తన్నీరు రమేశ్‌ను ములుగు మున్సిపల్‌ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గోవిందరాజుల గుడిలో  మండమెలిగె పూజలు
1
1/2

గోవిందరాజుల గుడిలో మండమెలిగె పూజలు

గోవిందరాజుల గుడిలో  మండమెలిగె పూజలు
2
2/2

గోవిందరాజుల గుడిలో మండమెలిగె పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement