రామప్పలో అధికారుల సందడి | - | Sakshi
Sakshi News home page

రామప్పలో అధికారుల సందడి

Jan 22 2026 7:23 AM | Updated on Jan 22 2026 7:23 AM

రామప్

రామప్పలో అధికారుల సందడి

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని హైదరాబాద్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 70 మంది అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌ భారత్‌ దర్శన్‌ స్టడీ టూర్‌లో భాగంగా బుధవారం రామప్పను సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్‌ గోరంట్ల విజయ్‌ కుమార్‌ ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి వివరించగా రామప్ప టెంపుల్‌ బాగుందని కొనియాడారు. వారి వెంట ఎంసీహెచ్‌ఆర్‌డీ అధికారులు శ్రీకాంత్‌, రవి, ఆర్‌ఐ రమేశ్‌, టూరిస్ట్‌లు ఉన్నారు. అలాగే క్యూబా దేశానికి చెందిన హెక్టర్‌ పెలాసియస్‌ రామప్ప దేవాలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌ విజయ్‌కుమార్‌ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు.

రామప్పలో అధికారుల సందడి1
1/1

రామప్పలో అధికారుల సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement