ప్రయాణికుల రద్దీ
ఏటూరునాగారం: సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు, పుట్టింటికి వచ్చిన మహిళలు తిరిగి తమ ఇళ్లకు చేరుకునేందుకు మంగళవారం బయలుదేరారు. దీంతో మంగళవారం ప్రయాణికులతో ఏటూరునాగారం బస్టాండ్ రద్దీగా మారింది. ఈ క్రమంలో బస్టాండ్‌లో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు పడిగాపులు పడ్డారు. అదే విధంగా భూపాలపల్లి, గోదావరి ఖని బస్సులను ఆర్టీసీ అధికారులు నిలిపివేయడంతో అటువైపు ప్రయాణించే ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలు వెళ్లేందుకు వారి సామగ్రితో బస్సు ఎక్కేందుకు కుస్తీపట్టారు.
మరమ్మతుకు నోచుకోని చేతి పంపు
మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన చేతి పంపు మరమ్మతుకు గురైంది. దానిని చేయించే నాథుడే కరువయ్యారు. కొంత మంది అందులో విద్యుత్ మోటారు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించే క్రమంలో చేతి పంపు మరమ్మతుకు గురైందని ప్రయాణికులు వాపోతున్నారు.
బస్టాండ్‌లో బస్సుల కోసం పడిగాపులు
ప్రయాణికుల రద్దీ


