అథ్లెటిక్స్‌లో క్రీడాకారుల ప్రతిభ
ఏటూరునాగారం: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబర్చి మూడు మెడల్స్ సాధించినట్లు హ్యాండ్‌బాల్ కోచ్ కుమారస్వామి, కరిష్మా తెలిపారు. మండల కేంద్రానికి చెందిన సంజన(లాంగ్‌జంప్ గోల్డ్‌మెడల్), ఎం.వైష్ణవి దేవి (300 మీటర్స్ సిల్వర్ మెడల్), కార్తీక్(300 మీటర్ల సిల్వర్) మెడల్స్ సాదించారని వివరించారు. ఈ క్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని ఇంద్రప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచారని కుమారస్వామి వివరించారు.
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని బూర్గుపేట, నారాయణపూర్ గ్రామాల్లో ఉచిత కృత్రిమ గర్భధారణ శిబిరాలు నిర్వహించినట్లు పశు వైద్యాధికారి మహతి తెలిపారు. బూర్గుపేటలో 46 గేదేలకు, నారాయణపూర్‌లో 48 గేదెలకు ఉచిత కృత్రిమ గర్భధారణ చికిత్స అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు సేద మల్లక్క, దోంతరవేన లక్ష్మి, పశువైద్య సిబ్బంది అయిలుమల్లు, వేణు, తేజ, రాజేందర్, ప్రశాంత్ పాల్గొన్నారు.
ములగు రూరల్: ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాషాయం జెండా ఎగురవేయాలని బీజేపీ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్ రాజేశ్వరావు అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ నాయకులు సిరికొండ బలరాం అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని వివరించారు. బీజేపీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు అహర్నిషలు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ నాయకులు సతీష్, రత్నం, భాస్కర్ రెడ్డి, రాజ్ నాయక్, స్వరూప, రమేష్, రవీంద్రచారి, తదితరులు పాల్గొన్నారు.
అథ్లెటిక్స్‌లో క్రీడాకారుల ప్రతిభ
అథ్లెటిక్స్‌లో క్రీడాకారుల ప్రతిభ


