అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
ములుగు: ప్రజావాణిలో వివిధ సమస్యలపై బాధితులు అందించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ దివాకర ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 59 మంది వినతులు అందజేశారు. ఇందులో భూ సమస్యలకు సంబంధించి 12 దరఖాస్తులు రాగా గృహ నిర్మాణశాఖకు 8, పింఛన్లు 8, ఉపాధి కల్పనకు 5, ఇతర శాఖలకు సంబంధించి 25 దరఖాస్తులు రాగా సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడి కొన్నింటిని సత్వరమే పరిష్కరించారు. ఈ గ్రీవెన్స్‌లో ఆదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గిరిజన దర్బార్‌లో వినతుల వెల్లువ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో వివిధ సమస్యలపై గిరిజనులు 19 వినతులు అందజేశారు. పీఓ చిత్రామిశ్రా వాటిని స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామని పీఓ వెల్లడించారు. గిరిజనులు అందించిన వినతులు ఇలా.. జనగామ జిల్లా నర్మెట్ట మండలం దొంగల చలిమితండాలో నిధులు రద్దు చేయాలని అక్కడి గిరిజనులు విన్నవించారు. గూడూరు మండలం చిన్న ఐలాపురంలో సీసీ రోడ్డు మంజూరు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. మేడారం మహాజాతరలో చైతన్య జానపద కళాబృందానికి అవకాశం కల్పించాలని కళాకారులు కోరారు. నర్సంపేట ఆదివాసీ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కోసం 20 ఎకరాల భూమి ఇప్పించాలని తుడుందెబ్బ నాయకులు పీఓను కోరారు. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో హుండీ కానుకుల్లో 25 శాతం నర్సంపేటలోని ఆదివాసీలకు వాటా ఇవ్వాలని కోరారు. వెంకటాపురం(కె) నూగూరుకు చెందిన పది మంది గిరిజనులు పీఎం జుగా కింద మేకలు, గొర్రెలు, తదితర పథకాలు అందించాలని పీఓకు మొరపెట్టుకున్నారు. గోవిందరావుపేట మండలం పస్రా నాగారం గ్రామానికి చెందిన గిరిజనుడు టీఆర్‌ఎఫ్ నుంచి ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన గిరిజనుడు సర్వేయర్ ఉద్యోగం ఇప్పించాలని కోరారు. ఇలా పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఓకు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, డీడీ జనార్ధన్, ఏఓ రాజ్‌కుమార్, ఎస్‌ఓ సురేశ్‌బాబు, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి, డీటీ అనిల్, మహేందర్, కొమురం ప్రభాకర్, ఆలెం కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ గ్రామమైన అంకన్నగూడెంలో సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా గ్రామంలో నిర్వహించే బాల కుమారస్వామి జాతరకు నిఽ దులు కేటాయించాలి. పదేళ్లుగా ఆదివాసీలమే జాతర ఖర్చులు భరిస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జాతర సందర్భంగా తాగునీటి వసతి, విద్యుత్, రోడ్డు నిర్మాణం చేప ట్టి, జాతరకు రూ. 2 లక్షల నిధులు కేటాయించాలి.
– కొట్టెం రాజు, అంకన్నగూడెం సర్పంచ్, ములుగు మండలం
కలెక్టర్ టీఎస్.దివాకర
ప్రజావాణిలో 59 దరఖాస్తుల స్వీకరణ
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి


