రాష్టస్థాయి సైక్లింగ్ పోటీల్లో ప్రతిభ
ములుగు రూరల్: 69వ రాష్ట్రసాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేడ్చల్ లో నిర్వహించిన ట్రాక్, రోడ్ సైక్లింగ్ పోటీలలో జిల్లా ఖేలో ఇండియా సెంటర్ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. ఈ మేరకు సోమవారం జిల్లా క్రీడల, యువజన సర్వీసుల శాఖ అధికారి సర్ధార్ సింగ్ పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం అభినందించారు. ట్రాక్ సైక్లింగ్‌లో అండర్–14 విభాగంలో శ్రీహర్షవర్ధిని, అండర్ –19 విభాగంలో వర్షిణి, అండర్–14 బాలుర విభాగంలో విష్ణులు తృతీయ స్థానంలో నిలిచారు. రోడ్డు సైక్లింగ్ అండర్–14 బాలుర విభాగంలో విష్ణు తృతీయ స్థానం, అండర్ –14 బాలికల విభాగంలో దూడబోయిన అక్షర ద్వితీయ స్థానం, అండర్–17 విభాగంలో లహరి తృతీయ స్థానం, అండర్ –17 బాలికల మాస్టార్ట్ విభాగంలో ఐషు తృతీయ స్థానం, అండర్–19 విభాగంలో వర్షిణి ద్వితీయ స్థానం సాధించారు. జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచిలో నిర్వహించబోయే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని కోచ్ శ్రీరాం తెలిపారు.
ములుగు: ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలనుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యర్యంలో ములుగులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలుర)లో సోమవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పర్యావరణ సమతుల్యాన్ని పరిరక్షించి జీవరాశులను కాపాడాలన్నారు. సహజ వనరులను పరిరక్షించాలని సూచించారు. విద్యార్థులందరూ పరిశుభ్రంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఉచిత న్యాయ సహాయానికి టోల్ ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామి దాస్,ఉపాధ్యాయులు రాజేందర్, మల్లయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్టస్థాయి సైక్లింగ్ పోటీల్లో ప్రతిభ


