బాధితులకు మనోధైర్యాన్ని కల్పించాలి
ములుగు: వ్యక్తిగత సమస్యలతో సఖీ కేంద్రానికి వచ్చే మహిళలు, బాలికలకు న్యాయ, వైద్య పరమైన సూచనలు ఇస్తూ వారిలో మనోధైర్యాన్ని కల్పించాలని చీఫ్ లీగల్ ఏయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రంలో శుక్రవారం జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. డిప్యూటీ చీఫ్ లీగల్ ఏయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్ మాట్లాడుతూ ఫోక్సో చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉచిత న్యాయం ఎలా పొందాలనేదానిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ బాలుగు చంద్రయ్య, డీసీపీఓ ఓంకార్, సైకాలజిస్ట్ కిరణ్‌కుమార్, డాక్టర్ నమ్రత, కృష్ణవేణి, సంధ్య, నరేష్, సంజీవ తదితరులు పాల్గొన్నారు.


