పీసీసీ లేకుండానే పైపులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో రోడ్ల నిర్మాణం పనుల్లో లోపాలు బయటపడుతున్నాయి. ఆర్‌అండ్‌బీశాఖ ఆధ్వర్యంలో జంపన్నవాగు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వై జంక్షన్ వరకు రోడ్లను విస్తరిస్తున్నారు. బస్టాండ్ సమీపంలో రోడ్డు విస్తరిస్తున్న క్రమంలో రోడ్డు కింద నుంచి నీళ్లు వెళ్లేందుకు పైపులు ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రోడ్డు కింది భాగంలో పైపుల ఏర్పాటుకు ముందుగా పీసీసీ(ప్లెయిస్ సిమెంట్ కాంక్రిట్) వేయాల్సి ఉండగా దాన్ని పూర్తిగా విస్మరించి నేరుగా పైపులు అమర్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పీసీసీ లేకుండా పైపులు వేయడం వల్ల భవిష్యత్‌లో అవి కుంగిపోయే ప్రమాదం ఉందని, వర్షాకాలంలో మట్టి కదలికలతో రోడ్డు దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతర సమయంలో లక్షలాది మంది వచ్చే నేపథ్యంలో రోడ్ల నిర్మాణంలో ఇలాంటి నిర్లక్ష్యం పనులు ప్రమాదకరమని భక్తులు పేర్కొంటున్నారు. పీసీసీ వేసి సైడ్ వాల్స్‌తో కూడిన పనులు చేపట్టాల్సి ఉండగా సంబంధిత గుత్తేదారులు ఖర్చు తగ్గించుకునేందుకు ఇలాంటి పనులు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
భవిష్యత్‌లో కుంగిపోయే ప్రమాదం
పట్టించుకోని అధికారులు


