ఆ నిధులపైనే ఆశలు | - | Sakshi
Sakshi News home page

ఆ నిధులపైనే ఆశలు

Dec 27 2025 6:55 AM | Updated on Dec 27 2025 6:55 AM

ఆ నిధ

ఆ నిధులపైనే ఆశలు

ఆ నిధులపైనే ఆశలు

ఆగిన ఆర్థిక సంఘం నిధులు

సొంత మేనిఫెస్టో

అమలు ఎలా?

ఆర్థిక సంఘం విదిలిస్తేనే పల్లెల్లో అభివృద్ధి

ములుగు: పల్లెల్లో కొలువుదీరిన కొత్త పాలకవర్గాలను సమస్యలు వెంటాడుతున్నాయి. గత 23 నెలలుగా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగడంతో ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. దీంతో కార్యదర్శులే అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేపడుతూ పాలన కొనసాగించారు. తాజాగా పంచాయతీల్లో పాలకవర్గాలు కొలువుదీరడంతో సమస్యలు స్వాగతం పలికాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు నిలిచిపోవడంతో గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 146 పంచాయతీల్లో గతంలో పనిచేసిన మాజీ సర్పంచ్‌లకు సుమారు రూ.15 కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరుణించి ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తే గ్రామ పంచాయతీల్లో కొంతమేర అభివృద్ధి పనులు జరగనున్నాయి.

146 పంచాయతీల్లో పాలకవర్గాలు

జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 జీపీలు ఉండగా మంగపేట మండలంలో పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు ఉండడంతో 25 జీపీలకు ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 146 పంచాయతీలకు ఈ నెల 11, 14, 17వ తేదీలలో ఎన్నికలు జరగగా పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు తమ పాలకవర్గంతో ఈ నెల 22న ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీల్లో బాధ్యతలు తీసుకున్నప్పటికీ పనులు చేపట్టడానికి ఎలాంటి నిధులు లేకపోవడంతో సర్పంచ్‌లు సతమతమవుతున్నారు. లక్షల రూపాయలు అప్పు చేసి సర్పంచ్‌గా గెలిస్తే అభివృద్ది పనులు చేపట్టేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని సర్పంచ్‌లు వాపోతున్నారు.

నిధులోస్తేనే అభివృద్ది పనులు

పంచాయతీలకు కేంద్రం ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామపంచాయతీ ఖాతాలో జమచేస్తుంది. జనాభా ప్రాతిపదికన కేంద్రం ఈ నిధులను కేటాయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌డీఎఫ్‌ నిధులను మంజూరు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను పారిశుద్ద్యం, వీధి దీపాలు, నీటి సరఫరా, రోడ్లు, డ్రెయినేజీ, ఆరోగ్యం, విద్య, వ్యవసాయంతో పాటు 29 అంశాలకు సంబంధించిన పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నిధులు విడుదల చేయాలని పాలకవర్గాలు కోరుతున్నాయి. ప్రభుత్వాలు స్పందించి నిధులు మంజూరు చేస్తేనే గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగనున్నాయి.

రెండేళ్లుగా 15వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. నిబంధనల ప్రకారం పాలక వర్గాలు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రం నిధులను నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. గతంలో తాజా మాజీ సర్పంచ్‌లు చేసిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. పంచాయతీ కార్యదర్శులు సైతం 23 నెలలుగా చేపట్టిన పనులకు నిధులు రాకపోవడంతో తమ వేతనాలు సైతం ఖర్చుపెట్టడమే కాకుండా అప్పులు కూడా చేశామని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో పారిశుద్ధ్యం, వీధి లైట్ల నిర్వహణ, తాగునీటికి సంబంధించిన మోటార్ల మరమ్మతు, పైపులైన్‌ లీకేజీలకు మరమ్మతులు, ట్రాక్టర్ల నిర్వహణ, డీజిల్‌ వంటి అత్యవసరమైన వాటికి అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని తాజా సర్పంచ్‌లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లక్షల రూపాయలు అప్పులు చేసి సర్పంచ్‌లుగా గెలిచామని, గెలిచిన తర్వాత కూడా అభివృద్ధి పనులకు, పంచాయతీ నిర్వహణకు అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం విడ్డూరంగా ఉందని వాపోతున్నారు.

సర్పంచ్‌ ఎన్నికల ముందు బరిలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు గెలిస్తే తమ సొంత మేనిఫెస్టోను అమలు చేస్తామని హామీనిచ్చారు. గ్రామాల్లో కోతులు, కుక్కల బెడద తీర్చడం, వీదుల్లో సీసీ రోడ్ల నిర్మాణం, సైడ్‌ డ్రెయినేజీల నిర్మాణం, కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్‌, దేవాలయాల నిర్మాణం చేపడుతామని సొంతంగా హామీలు ఇచ్చారు. ఇప్పటికే లక్షల రూపాయలు అప్పులు చేసి గెలిచిన తాము సొంత మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు సహకరిస్తేనే ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయగలుగుతామని సర్పంచ్‌లు పేర్కొంటున్నారు.

సమస్యలతో సతమతమవుతున్న

సర్పంచ్‌లు

ప్రభుత్వాలు కరుణిస్తేనే గ్రామాల్లో పనులు

ఆ నిధులపైనే ఆశలు1
1/2

ఆ నిధులపైనే ఆశలు

ఆ నిధులపైనే ఆశలు2
2/2

ఆ నిధులపైనే ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement