మహాజాతరకు ప్రత్యేక బస్సులు
ములుగు రూరల్: మేడారం మహాజాతరకు ముందస్తుగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ వరంగల్ 2 డిపో మేనేజర్ రవిచందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి ఉదయం 6 గంటల నుంచి భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపిస్తామని వివరించారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని తెలిపారు. మేడారం తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు ప్రస్తుతం బస్సులు గద్దెల వరకు వెళ్తున్నాయని వివరించారు. భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ములుగు రూరల్: ఈ నెల 21న కోల్‌కత్తాలో నిర్వహించిన ప్రోకామ్ స్లామ్ ఇంటర్నేషనల్ ఈవెంట్‌లో జిల్లాలోని మల్లంపల్లి మండలం రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన బలబక్తుల వెంకటేశ్వర్లు పతకం సాధించారు. వెంకటేశ్వర్లు ప్రోకామ్ స్లామ్ ఇంటర్నేషనల్ ప్రమోట్ చేసిన నిర్ధిష్ట 25 కిలో మీటర్ల రన్నింగ్ 2.28 గంటలలో పూర్తి చేసి అత్యుత్తమ ప్రతిభకనబర్చారు. ఈ మేరకు టాటా స్టీల్ వరల్డ్ డైరెక్టర్ కేవీన్ చేతుల మీదుగా పతకాన్ని అందుకున్నారు. వెంకటేశ్వర్లు ఆర్పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించి వీఆర్‌ఎస్ పొంది క్రీడారంగంలో కొనసాగుతున్నారు. అంతర్జాతీయ పతకం సాధించడంతో గ్రామస్తులు వెంకటేశ్వర్లను అభినందించారు.
ములుగు: దొడ్డి కొమురయ్య సినిమా ద్వారా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నేలకొరిగిన వీరుల చరిత్రను నేటి తరానికి అందించేలా సినిమాను రూపొందిస్తామని చిత్ర దర్శకుడు సేనాపతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంతి ఉద్యోగస్తుల భవనంలో కుమార్ పాడ్య అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎంతోమంది తెలంగాణ బిడ్డలు నేలకొరిగారని తెలిపారు. ఇప్పటికీ వారి చరిత్రలు బయటికి రాలేకపోయాయని, అందుకే దొడ్డి కొమురయ్య సినిమా ద్వారా ఆనాటి చరిత్రను నేటి తరానికి అందించాలన్న ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో చిలువేరు రాంచందర్, కుసూరి సదానందం, ధరావత్ రాంచంద్రానాయక్, పోరిక పోమా నాయక్, అజ్మీర శ్యామల్ నాయక్, కసన్ సింగ్, కొర్ర రాజునాయక్, పోరిక రాహుల్ నాయక్, గుగులోత్ తిరుపతి, రత్నం ప్రవీణ్, బానోత్ అనిల్, బానోత్ రవీందర్, పోరిక కిశోర్, అజ్మీర దేవ్‌సింగ్ పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆవివర్భావ వేడుకలు జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్(పార్టీ కార్యాలయం)లో జిల్లా నాయకులతో కలిసి పార్టీ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
మహాజాతరకు ప్రత్యేక బస్సులు
మహాజాతరకు ప్రత్యేక బస్సులు


