అగ్ని ప్రమాదాల నివారణకు కృషి
ములుగు: అగ్నిప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఫైర్ ఆఫీసర్ కుమారస్వామి సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో అగ్ని ప్రమాదాల నివారణపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు భయపడకుండా ధైర్యంగా స్పందించాలన్నారు. అగ్ని ప్రమాదాలను గుర్తించిన వెంటనే ఆస్పత్రిలో అందుబాటులో ఉండే ఫైర్ ఎక్సిటింగ్విషర్స్‌ను వాడే విధానంపై వివరించారు. మంటలు పెద్దస్థాయిలో వ్యాపించినప్పడు వెంటనే 101, ములుగు ఫైర్ స్టేషన్ నంబర్ 8712699210, స్టేషన్ పైర్ ఆఫీసర్ సెల్ నంబర్ 8712699211కు కాల్‌చేసి సమస్యను వివరించాలని సూచించారు. అనంతరం అగ్నిమాపక వాహనం పని విధానంపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్, పైర్ సిబ్బంది నగేష్, డ్రైవర్ కుమార్, ఫైర్‌మెన్ మహేందర్, రాజు, ప్రవీణ్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫైర్ ఆఫీసర్ కుమారస్వామి


