‘తండ్రి, కొడుకులిద్దరూ అబద్దాల కోరులు’ | - | Sakshi
Sakshi News home page

Feb 26 2023 10:10 AM | Updated on Feb 27 2023 6:45 PM

భూపాలపల్లి రూరల్‌: సింగరేణిని కేంద్రం ప్రైవేట్‌పరం చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ మంత్రి కేటీఆర్‌ అబద్దాలను ప్రచారం చేస్తున్నారని.. అబద్దాలను నమ్మించే శక్తి తండ్రి కొడుకులకు ఉందని హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం రాత్రి భూపాలపల్లి పట్ణణంలో 6వ వార్డు ఇన్‌చార్జ్‌ ఎరుకల గణపతి ఆధ్వర్యంలో ప్రజాగోస– బీజేపీ భరోసా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఈటల రాజేందర్‌, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చందుపట్ల కీర్తిరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈసందర్బంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ ఒకప్పుడు లక్షా 24వేల మంది కార్మికులతో కళకళలాడిన సింగరేణి సంస్థలో ఇప్పుడు 43వేలకు కుదించబడ్డారని చెప్పారు. సంస్థలోని కాంట్రాక్టు కార్మికులందరినీ రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. తక్కువ వాటా ఉన్న కేంద్రం సింగరేణిని ఎలా ప్రైవేట్‌పరం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సింగరేణి అభివృద్ధికి రూ.1650 కోట్ల నిధులు కేటాయించడం నిజంకాదా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే పలు పనులు చేపడుతూ.. తమ ప్రభుత్వం చేస్తుందని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement