'జమాన' టైటిల్ ప్రోమోను రిలీజ్‌ చేసిన ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల | Zamana Movie Unveiled By Director Venky Kudumula | Sakshi
Sakshi News home page

'జమాన' టైటిల్ ప్రోమోను రిలీజ్‌ చేసిన ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల

Published Sun, Nov 12 2023 5:24 PM | Last Updated on Sun, Nov 12 2023 5:24 PM

Zamana Movie Unveiled By Director Venky Kudumula - Sakshi

ఇటీవల కాలంలో టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కంటెంట్ ఉన్న సినిమాకు దక్కుతున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథా బ‌లం ఉంటే చిన్న సినిమాలకు కూడా ప్రేక్ష‌కులు పెద్ద‌ విజయాలు కట్టబెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ కోవ‌లోనే ఈ తరం యువత ఆలోచనలకు అద్దం ప‌ట్టే ఒక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో తెర‌కెక్కుతోన్న యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ `జ‌మాన‌`. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌`బ్రో` సినిమాతో సుప‌రిచితుడైన సూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రలలో నటిస్తుండ‌గా శ్రీ ల‌క్ష్మీ వ‌ల్ల‌భ క్రియేష‌న్స్, విఎస్ అసోసియేట్స్ ప‌తాకాల‌పై తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భాస్క‌ర్ జ‌క్కుల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

తాజాగా ఈ మూవీ టైటిల్ ప్రోమోను ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ - 'జ‌మాన టైటిల్ ప్రోమో చూశాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ సినిమాలో నటించిన సూర్య శ్రీ‌నివాస్, సంజ‌య్‌కి ఆల్ ది బెస్ట్‌. డైరెక్ట‌ర్ భాస్క‌ర్ జ‌క్కుల విజ‌న్ బాగా న‌చ్చింది. టైటిల్ ప్రోమోలో చార్మినార్ ద‌గ్గ‌రి షాట్ చాలా బాగుంది. డిఓపి చ‌క్క‌గా తీశారు. ఈ సినిమాకు సంబందించి ఎలాంటి స‌హాయం కావాల‌న్నా మా టీమ్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది. ఈ సినిమా నిర్మాత‌ల‌కు, చిత్ర య‌నిట్ కు ఆల్ ది వెరీ బెస్ట్' అన్నారు.

హీరో సూర్య శ్రీ‌నివాస్ మాట్లాడుతూ.. 'మేం అడ‌గ‌గానే వెంట‌నే మా 'జ‌మాన' టైటిల్ ప్రోమోను విడుద‌ల చేసిన వెంకీ కుడుముల గారికి థ్యాంక్స్‌...ఆయ‌న‌ది ల‌క్కీ హ్యాండ్‌. ఆయ‌న చేతుల మీదుగా విడుద‌లైన మా 'జ‌మాన' సినిమా కూడా మంచి విజ‌యం సాధిస్తుందని న‌మ్మ‌కం ఉంది.. మా డైరెక్ట‌ర్ భాస్క‌ర్ గారికి మంచి విజ‌న్ ఉంది. నేటి యువ‌త‌కు సంబందించి ఒక అద్భుత‌మైన క‌థ‌తో ఈ చిత్రానికి తెర‌కెక్కించారు. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌ల‌కి థ్యాంక్స్‌.' అన్నారు.

ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ జ‌క్కుల మాట్లాడుతూ.. 'జ‌మాన టైటిల్ ప్రోమో రిలీజ్ చేసిన ద‌ర్శ‌కులు వెంకీ కుడుముల గారికి థ్యాంక్స్‌. చార్మినార్, ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్ లో యూత్ కి నచ్చే విధంగా 'జమాన' చిత్రాన్ని తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. ఫ‌స్ట్ మూవీ అయినా యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్ మంచి స‌పోర్ట్ ఇచ్చారు. అలాగే ఈ క‌థ‌ని న‌మ్మి ప్రొడ్యూస్ చేసిన మా నిర్మాత‌ల‌కి థ్యాంక్స్‌..త్వ‌ర‌లోనే మ‌రో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌తో మీ ముందుకు వ‌స్తాం.' అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement