పాన్‌ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్న యంగ్‌ హీరో | Young Hero Eshwar Prasad Upcoming Movie Details | Sakshi
Sakshi News home page

పాన్‌ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్న యంగ్‌ హీరో

Jul 10 2024 1:48 PM | Updated on Jul 10 2024 2:54 PM

Young Hero Eshwar Prasad Upcoming Movie Details

పాన్‌ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది టాలీవుడ్‌. ఇప్పటికే పలు యంగ్‌ హీరోలు తమ సినిమాలను పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఆ లిస్ట్‌లోకి తాజాగా యంగ్‌ హీరో ఈశ్వర్‌ ప్రసాద్‌ కూడా చేరాడు.  4లెటర్స్ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయిన ఈశ్వర్ ప్రసాద్.. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ఈయన సొంతూరు తిరుపతి. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. అయితే సినిమాలపై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించనప్పటికీ.. ఈ‍శ్వర్‌కు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే రెండో సినిమా కోసం చాలా సమయం తీసుకున్నాడు. పలు కథలు విని.. చివరకు ఓ పాన్‌ ఇండియా స్టోరీని ఓకే చేశాడు. జులై 11న తన బర్త్‌డే సందర్భంగా లుగు లో పీకాక్ ఇండియన్ సినిమా బ్యానర్ లో ఓ పాన్ ఇండియా సినిమా ను స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను జులై 11న వెల్లడిస్తామని ఈశ్వర్‌ చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement