breaking news
Eshwar Prasad
-
ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయావు షర్మిల?
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై షర్మిల ఆరోపణల్లో ఏ మాత్రం లాజిక్ లేదంటూ వైఎస్సార్సీపీ ఇంటెలెక్టుల్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు వై ఈశ్వర ప్రసాద్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘‘అటాచ్మెంట్లో ఉంది భూమి మాత్రమే, షేర్ కాదంటున్నారు. ఒక కంపెనీ లో మెజారిటీ షేర్లు ట్రాన్స్ఫర్ అయితే, షేర్లతో పాటు భూమి కూడా కొన్న వారి స్వాధీనం అవుతుందనే చిన్న ప్రాథమిక సూత్రం విస్మరిస్తే ఎలా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు. ‘‘ఇలా భూమిని బదలాయింపు చేస్తే హైకోర్టు ఆజ్ఞలను అతిక్రమించినట్లు కాదా? దీని పర్యవసానం ఎలా వుంటుందన్నది మీకు తెలియదా?. మీ చర్యల వల్ల మీ మీద ప్రేమతో మీ సోదరుడు వైఎస్ జగన్ ఇవ్వాలనుకున్న ఆస్తులు మీకు వస్తాయో లేదో కానీ, వైఎస్సార్ ద్వేషులు మాత్రం చాలా ఆనందంగా వున్నారు. బాగా చదువుకున్న దానివి. ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా అమ్మా?’’ అని ఈశ్వర్ ప్రసాద్‌రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: బాబు వదిలిన కుట్ర ‘బాణం’వైఎస్సార్ కుమార్తెగా చెప్పుకుంటూ.. కోట్లాది అభిమానుల గుండెల్లో ఒక దేవుడిగా నిలిచిన ఆ మహానుభావుని చావు కోరుకున్న దుర్మార్గుల చెంత చేరి, వారి చేతిలో కీలుబొమ్మ అయితే ఆ మహా నేత అభిమానులు ఎంతగా మానసిక క్షోభకు గురి అవుతారో ఒక్క గుర్తు చేసుకో తల్లి. ఆ నాయకుడి కూతురిగా మీరు ఎలా భరించగలుగుతున్నారో గాని, మాకు మాత్రం చాలా కష్టంగా వుంది. దయచేసి ఇప్పటికైనా ఆ కబంధ హస్తాల నుంచి బయటకు రండి’ అంటూ ఈశ్వర్ ప్రసాదరెడ్డి హితవు పలికారు. -
పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్న యంగ్ హీరో
పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది టాలీవుడ్. ఇప్పటికే పలు యంగ్ హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ లిస్ట్‌లోకి తాజాగా యంగ్ హీరో ఈశ్వర్ ప్రసాద్ కూడా చేరాడు. 4లెటర్స్ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయిన ఈశ్వర్ ప్రసాద్.. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన సొంతూరు తిరుపతి. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. అయితే సినిమాలపై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించనప్పటికీ.. ఈశ్వర్‌కు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే రెండో సినిమా కోసం చాలా సమయం తీసుకున్నాడు. పలు కథలు విని.. చివరకు ఓ పాన్ ఇండియా స్టోరీని ఓకే చేశాడు. జులై 11న తన బర్త్‌డే సందర్భంగా లుగు లో పీకాక్ ఇండియన్ సినిమా బ్యానర్ లో ఓ పాన్ ఇండియా సినిమా ను స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను జులై 11న వెల్లడిస్తామని ఈశ్వర్ చెప్పారు.