ఆకట్టుకుంటున్న 'ఏందిరా ఈ పంచాయితీ' గ్లింప్స్ | Yendira Ee Panchayithi Glimpse Out | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న 'ఏందిరా ఈ పంచాయితీ' గ్లింప్స్

Aug 22 2023 3:59 PM | Updated on Aug 22 2023 4:20 PM

Yendira Ee Panchayithi Glimpse Out - Sakshi

ప్రేమ కథలకు టాలీవుడ్‌లో మంచి ఆదరణ ఉంది. కథలో కొంచెం కొత్తదనం ఉంటే చాలు.. ఆ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అందుకే యువ దర్శకులు ఎక్కువగా లవ్‌స్టోరీలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో ప్రేమ కథా చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’ రాబోతుంది. భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి  గంగాధర.టి దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్న ఈ చిత్రం గ్లింప్స్‌ తాజాగా విడుదలైంది.

మంచోడే అంటావా?’ అంటూ హీరోయిన్ డైలాగ్‌తో గ్లింప్స్ ఓపెన్ అవుతుంది. ‘ఎవరే.. ’అని హీరోయిన్ ఫ్రెండ్ డైలాగ్.. ‘అదే అభి..’ అంటూ హీరోయిన్ కాస్త హీరో ఇంట్రడక్షన్ గురించి చెప్పడం.. ‘యమునా.. తొందరగా నా గురించి ఏమైనా ఆలోచించొచ్చు కదా?’ అని హీరో అనడం.. (నువ్వేమైనా అర్జున్ రెడ్డి సినిమాలో హీరో అనుకుంటున్నావా?’ అని హీరోయిన్ డైలాగ్ ఇలా గ్లింప్స్ మొత్తం కూడా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది. ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement