ఆకట్టుకుంటున్న ‘ఏమి మాయ ప్రేమలోన' పాట | Yemi Maya Premalona Video Song Released | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న ‘ఏమి మాయ ప్రేమలోన' పాట

Oct 5 2025 7:15 PM | Updated on Oct 5 2025 7:15 PM

Yemi Maya Premalona Video Song Released

అనిల్ ఇనుమడుగు హీరోగా, వేణి రావ్ హీరోయిన్ గా తెరకెక్కిన ' ఏమి మాయ ప్రేమలోన' మ్యూజిక్ ఆల్బం కు మంచి ఆదరణ లభిస్తోంది. లీడ్ రోల్ లో నటించిన అనిల్ ఇనుమడుగు ఈ పాటకు లిరిక్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహించడం విశేషం. మార్క్ ప్రశాంత్ సంగీతం అందిచిన ఏమి మాయ ప్రేమలోన' సాంగ్ ను దిన్కర్ కలవుల, దివ్య ఐశ్వర్య ఆలపించారు.

కేరళలో టూరిస్ట్గైడ్గా పని చేసే ఓ అనాథ కుర్రాడి జీవితంలో ఓ మేఘాలు కమ్ముకున్న రోజు కనిపించిన మేఘాల మధ్యన దాగిన మెరుపులా ఆ కుర్రాడికి తారాసపడిన ఆ అమ్మాయి ప్రేమని గెలుచుకునే ఓ సున్నితమైన కథాంశం నేపధ్యంలో తెరకెక్కిన ఏమి మాయ ప్రేమాలోన సాంగ్ దసరా కానుకగా యూట్యూబ్ లో రిలీజ్ అయి భారీ వ్యూస్ రాబడుతూ దూసుకెళ్తోంది. కాన్సెప్ట్ తో పాటు డైరెక్షన్ కూడా మెచ్చుకోదగిన విధంగా ఉంది. 

ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉందని చెప్పాలి. కేరళలోని లొకేషన్స్ ను చూడముచ్చటగా చూపించాడు సినిమాటోగ్రాఫర్ శ్రవణ్. ప్రతి ఫ్రెమ్ ను రిచ్ గా మలిచాడు. లీడ్ రోల్స్ చేసిన అనిల్, వేణి రావ్ జోడి బాగుంది. స్క్రీన్ మీదా ఇద్దరు సహజంగా నటించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పది నిమిషాల నిడివి కలిగిన ఏమి మాయ ప్రేమలోన సాంగ్ ను అకి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో యంగ్ నిర్మాతలు అజయ్, విష్ణు నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement