Yami Gautam Says Bollywood Promoting Untalented Actor For Marketing - Sakshi
Sakshi News home page

Yami Gautam: ఆ కోరిక ఉన్నవారు సినిమాల్లో ఎక్కువగా నిలవలేరు

Aug 17 2023 10:34 AM | Updated on Aug 17 2023 10:52 AM

Yami Gautam Says Bollywood Promoting Untalented Actor For Marketing - Sakshi

హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి యామీగౌతమ్‌. ముఖ్యంగా తమిళంలో గౌరవం, నటుడు జయ్‌కు జంటగా తమిళ్‌ సెల్వనుమ్‌ తనియార్‌ అంజలుమ్‌ తదితర చిత్రాల్లో నటించిన ఈ ఉత్తరాది బ్యూటీ వాణిజ్య ప్రకటనల ద్వారా చాలా పాపులర్‌ అయ్యింది. అయితే ఇటీవల ఈ అమ్మడు దక్షిణాది చిత్రాల్లో కనిపించి చాలాకాలం అయ్యింది.

ఇటీవల ఒక భేటీలో యామీగౌతమ్‌ పేర్కొంటూ చిత్రాలను మార్కెంటింగ్‌ చేయడంపై అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే చాలా మంది నటీనటులు, సాంకేతిక వర్గం తమ ప్రతిభను పూర్తిగా ప్రదర్శించలేకపోతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. హిందీలోనూ మార్కెటింగ్‌ సంస్కృతి పెరిగిపోతోందని చెప్పింది. సినిమాల్లో కొందరు ఒక్క చిత్రంతోనే పాపులర్‌ అవుతారని, మరికొందరు చాలా కాలం శ్రమించి సక్సెస్‌ అవుతారని చెప్పింది.

మరి కొందరు పబ్లిసిటీ ద్వారా సక్సెస్‌ కావాలని ఉబలాట పడతారని పేర్కొన్నారు. ఇలాంటి వారు ఎక్కువ కాలం సినిమాల్లో నిలవలేరని అభిప్రాయపడింది. కేవలం పబ్లిసిటీతోనే అన్నీ రావని అన్నారు. అయినా వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించాలనే ఆసక్తి కంటే పబ్లిసిటీ ద్వారా పాపులర్‌ అవ్వాలనే భావన ఇటీవల అధికం అవుతోందని పేర్కొంది. తాను మాత్రం పబ్లిసిటీకి దూరంగా ఉంటానని చెప్పింది. ప్రతిభను నమ్మి శ్రమిస్తే విజయం తనంతట తానే వరిస్తుందని పేర్కొంది. ఇంతకీ ఈ అమ్మడు సడన్‌గా ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందనే చర్చ చర్చ ఇప్పుడు సామాజక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement