ఫోటో అని చెప్పి.. ఏకంగా వీడియోనే తీశాడు: ప్రముఖ హీరోయిన్ | Yami Gautam react when a young boy recorded her video in her hometown | Sakshi
Sakshi News home page

Yami Gauta‍m:నా వీడియో తీసి అసభ్యకరంగా పోస్ట్ చేశాడు: యామీ గౌతమ్

Feb 28 2023 3:55 PM | Updated on Feb 28 2023 4:40 PM

Yami Gautam react when a young boy recorded her video in her hometown  - Sakshi

సాధారణంగా సెలబ్రిటీలు కనిపిస్తే చాలు ఫోటోల కోసం క్యూ కడతారు. సెల్‌ఫోన్ తీసి టపీమని సెల్ఫీలు తీయడం చూస్తుంటాం. పోనీలే ఫ్యాన్స్ కదా వారు కూడా ఓపిగ్గా నిలబడి ఫోటోలు దిగుతారు. ఒకరోజు తన స్వగ్రామానికి వెళ్లిన ఓ నటి అభిమాని అడ్డగ్గానే సెల్ఫీ దిగేందుకు ఒప్పుకుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ మన హీరో ఆమెకు తెలియకుండా ఏకంగా వీడియోనే తీశాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను అసభ్యకరంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ కావడంతో హీరోయిన్ ఆ వీడియోపై స్పందించింది. 

అనిరుద్ధ రాయ్ చౌదరి చిత్రంలో తన నటనకు ప్రశంసలు అందుకుంటున్న నటి యామీ గౌతమ్. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని తన ఇంట్లో జరిగిన ఒక సంఘటన గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఒక అభిమాని తనను ఫోటో కోసం అభ్యర్థించాడని.. కానీ అతను వీడియో చిత్రీకరించడం గుర్తుచేసుకుంది. ఆ  తర్వాత  వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేశాడని నటి వెల్లడించింది. యామీ గౌతమ్ ఇటీవల అలియా భట్  గోప్యతా ఉల్లంఘన సంఘటనపై కూడా స్పందించింది. అయితే ఇటీవల ఆలియా భట్ ఇంట్లో ఉండగా కొందరు ఆమె ఫోటోలను తీశారు. దీనిపై ఆమె తన ఇన్‌స్టా వేదికగా ప్రశ్నించింది. 

యామీ గౌతమ్ మాట్లాడుతూ..'నేను చాలా ఓపెన్‌గా ఉంటా. వ్యక్తులను స్వాగతించడం ఇష్టం. యామీ తెలిపింది. మా ఊరు ఒక చిన్న పట్టణం కావడంతో ప్రజలు నాతో మాట్లాడాలని కోరుకుంటారు. నాకు కూడా అది చాలా హ్యాపీ. కానీ ఓ అబ్బాయి నాతో ఫోటో దిగేందుకు వచ్చాడు. కానీ అతను వీడియో తీశాడు. ఇది చాలా దారుణంగా ఉంది. అంతేకాకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన లక్షలు వ్యూస్ సాధించాడు. ఆ సక్సెస్‌ను కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వీడియో చూసి చాలామంది మా ఇంటికి వచ్చారు. దీంతో నేను ఒక్కసారిగా షాకయ్యా. ఇలాంటి వాటితో యువతకు మనం తప్పుడు సంకేతాలు ఇస్తున్నాం. దీంతో వారిని వెంటనే వారించాను. వ్యక్తిగత జీవితంలో ప్రైవసీ చాలా ముఖ్యం.' అంటూ చెప్పుకొచ్చింది. 

కాగా.. యామీ గౌతమ్ ప్రస్తుతం సన్నీ కౌశల్‌తో కలిసి 'చోర్ నికల్ కే భాగా'లో కనిపించనుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఆమె తదుపరి అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠితో ఓ మై గాడ్ 2, ప్రతీక్ గాంధీతో ధూమ్ ధామ్‌లో కూడా నటిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement