Yami Gautam Opens Up on Battling Keratosis Pilaris - Sakshi
Sakshi News home page

Yami Gautam: అది యాక్సెప్ట్ చేయడానికి ఏళ్లు పట్టింది.. హీరోయిన్‌ ఎమోషనల్ పోస్ట్‌

Dec 27 2021 5:27 PM | Updated on Dec 27 2021 6:37 PM

Yami Gautam Emotional Post On Battling Keratosis Pilaris - Sakshi

విక్కీ డౌనార్‌, సనమ్‌ రే, బద్‌లా పూర్‌, కాబిల్‌, ఉరి, గౌరవం, కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌ వంటి చిత్రాలతో బాలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన బీటౌన్‌ ముద్దుగుమ్మ యామీ గౌతమ్‌. ఇటీవల తన వ్యక్తిగత విషయం గురించి వెల్లడించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. సోషల్‌ మీడియా వేదికగా తాను ఎదుర్కొన్న చర్మ సమస్యపై పోస్ట్‌ పెట్టింది. యామీ తన యుక్త వయసు నుంచి 'కెరాటోసిస్ పిలారిస్‌' అనే చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇన్‌స్టా గ్రామ్‌లో తెలిపింది.  ఇటీవల ఎలాంటి ఎడిట్ చేయని తన ఫొటోలను పోస్ట్‌ చేసి ఎమోషనల్‌గా క్యాప్షన్‌ రాసుకొచ్చింది యామీ గౌతమ్‌. 

'నేను చాలా ఏళ్ల నుంచి ఇప్పటిదాకా ఏర్పరుచుకున్నా భయం, అభద్రతా భావాలను వీడాలని చివరిగా ఇప్పుడు నిర్ణయించుకున్నాను. నా లోపాలను (చర్మ సమస్య) హృదయపూర్వకంగా అంగీకరించే ధైర్యం నాకు వచ్చింది. ఈ నిజాన్ని మీతో పంచుకునే ధైర్యం వచ్చింది. ఎరుపు రంగులో ఉండే నా హెయిర్‌కు రంగు వేయడం, కంటి కింద చారలను స్మూత్‌నింగ్‌ చేయాలని నాకు అనిపించట్లేదు. అయినా నేను అందంగానే ఉన్నా.' అని షేర్‌ చేసింది యామీ. ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన తర్వాత దానికి వచ్చిన స్పందన గురించి ఇలా చెప్పుకొచ్చింది యామీ గౌతమ్‌. 

ఈ పోస్ట్‌లో 'పోస్ట్ రాయడం కష్టం కాదు. అది విముక్తి కలిగిస్తుంది. నా పరిస్థితి గురించి తెలుసుకున్నప్పటి నుంచి నేను పోస్ట్‌ పెట్టే వరకు నా ప్రయాణం సవాలుగా మారింది. ప్రజలు నన్ను షూట్‌లో చూసినప్పుడు ఎయిర్‌ బ్రష్ ఎలా చేయాలి, కనపడకుండా ఎలా దాచాలి అని మాట్లాడతారు. అది నన్ను చాలా ప్రభావితం చేసేది. ఆ నిజాన్ని అంగీకరించడానికి, నా విశ్వసాన్ని పెంపొందిచుకోవడానికి సంవత్సరాలు పట్టింది. ఈ పోస్ట్‌కు వచ్చిన స్పందన చూసి ఉబ్బితబ్బిబ్బయ్యాను.' అని యామీ గౌతమ్‌ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement