టీచర్‌ యామీ | Yami Gautam to be next seen in thriller A Thursday | Sakshi
Sakshi News home page

టీచర్‌ యామీ

Sep 6 2020 5:34 AM | Updated on Sep 6 2020 5:34 AM

Yami Gautam to be next seen in thriller A Thursday - Sakshi

యామీ గౌతమ్

టీచర్స్‌ డే సందర్భంగా తన తాజా చిత్రాన్ని ప్రకటించారు బాలీవుడ్‌ హీరోయిన్‌ యామీ గౌతమ్‌. తన తదుపరి సినిమాలో టీచర్‌ పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారామె. బెహ్జాద్‌ కంబాత్‌ దర్శకత్వం వహించనున్న ‘ఏ థర్స్‌డే’ చిత్రంలో యామీ గౌతమ్‌ లీడ్‌ రోల్‌ చేయనున్నారు. ఈ సినిమాలో ప్లే స్కూల్‌ టీచర్‌గా యామీ కనిపిస్తారట.

అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ప్లే స్కూల్‌లోని 16 మంది చిన్నారులను బంధీగా తన ఆధీనంలో ఉంచుకోవాల్సి వస్తుందట. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది చిత్రకథాంశం. రోనీ స్క్రూవాలా నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ‘‘ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. అందుకే కథ విన్న వెంటనే ఒప్పేసుకున్నా’’ అన్నారు యామీ. ఇది కాకుండా ‘గిన్నీ వెడ్స్‌ సన్నీ, భూత్‌ పోలీస్‌’ సినిమాల్లో నటిస్తున్నారామె.

Advertisement
 
Advertisement
Advertisement