ఆక‌ట్టుకుంటోన్న `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` క్యారెక్ట‌ర్ పోస్ట‌ర్స్‌ | WWW Movie Character Poster Out | Sakshi
Sakshi News home page

ఆక‌ట్టుకుంటోన్న `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` క్యారెక్ట‌ర్ పోస్ట‌ర్స్‌

Dec 23 2021 4:27 PM | Updated on Dec 23 2021 4:27 PM

WWW Movie Character Poster Out - Sakshi

అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై  ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 24 నుంచి ప్రముఖ ఓటీటీ సోనిలివ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఫస్ట్‌ టైమ్ కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రమిది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి విశేష స్పందన లభించగా.. తాజాగా ఈ చిత్రంలోని న‌టీన‌టుల పాత్ర‌ల‌కు సంబందించి క్యారెక్ట‌ర్ పోస్ట‌ర్స్‌ విడుదలయ్యాయి. ఈ మూవీలో అరుణ్‌   `విశ్వ‌`గా న‌టిస్తుండ‌గా, శివాని రాజ‌శేఖ‌ర్ `మిత్ర` పాత్ర పోషిస్తుంది. వారి మిత్రులుగా  `అష్ర‌ఫ్` పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి, `చిష్ట్రి` పాత్ర‌లో దివ్య శ్రీ‌పాద న‌టిస్తున్నారు. వైవా హర్ష, సత్యం రాజేష్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తుండగా  న‌టుడు రియాజ్ ఖాన్ `ఖాన్‌`పాత్ర‌ధారిగా కనిపించ‌నున్నారు. ఈ కాన్సెప్ట్ పోస్ట‌ర్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement