క్రాక్‌ సినిమా కథ నాదే: రచయిత ఫిర్యాదు

Writer Complaint On Krack Movie At Banjara Hills PS - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: రవితేజ హీరోగా నటించిన క్రాక్‌ సినిమా కథ తనదేనని తనను మోసం చేసిన సినీ నిర్మాతతో పాటు ఇతర యూనిట్‌ సభ్యులపై చీటింగ్‌ కేసు నమోదు చేయాలని ఓ రచయిత జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలివీ... అల్వాల్‌లో నివాసం ఉంటున్న శివ సుబ్రమణ్యమూర్తి అనే వ్యక్తి 2015లో బళ్లెం సినిమా మీడియా డైరెక్టరీ అనే పుస్తకాన్ని రాశారు.

ఏడాదిన్నర క్రితం రవితేజ హీరోగా వచ్చిన క్రాక్‌ సినిమాలో సన్నివేశాలు, కథ, కథనం మొత్తం తన పుస్తకంలో ఉన్నదేనని సదరు నిర్మాణ సంస్థతో పాటు దర్శకుడు, హీరోలకు ఫిలించాంబర్‌ నుంచి నోటీసులు పంపించినా పట్టించుకోవడం లేదని సుబ్రమణ్యమూర్తి గురువారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా నిర్మాత మధుసూదన్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో నివాసం ఉంటున్న కారణంగా తాను ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  
చదవండి: యూట్యూబర్‌ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top