ఈ సినిమా టిక్కెట్లు ఇవాళే కొనండి: హీరోయిన్‌

Wonder Woman Gal Gadot Shares Her Movie News - Sakshi

హాలీవుడ్‌ హీరోయిన్‌ గాల్‌ గడోట్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వండర్‌ ఉమన్‌ 1984’. 2017 వచ్చిన ‘వండర్‌ ఉమన్‌’కు ఇది కొనసాగింపు. ప్యాటీ జెన్‌కిన్స్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న క్రిస్మస్‌ సందర్భంగా థియేటర్ల తలుపు తట్టనుంది. సినిమా టిక్కెట్లు బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని గాల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులకు తెలియజేశారు. ( ‘టెనెట్’‌ చూసి ఆనందించండి: క్రిస్టోఫర్ నోలాన్)

ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారామె. ‘‘ఈ విషయాన్ని మీతో షేర్‌ చేసుకోవటం ఎంతో ఉత్సాహంగా ఉంది. ‘వండర్‌ ఉమెన్‌ 1984’ సినిమా అతి త్వరలో విడుదల కాబోతోంది. మీ దగ్గరలో థియేటర్‌ ఉంటే గనుక మీరు మీ టిక్కెట్లను ఈ రోజే కొనుగోలు చేయండి. ఈ స్పెషల్‌ సినిమాను ఆనందించండి’’ అని పేర్కొన్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top