Parineeti Chopra's Starrer Saina Nehwal Biopic Release In OTT - Sakshi
Sakshi News home page

ఓటీటీలోనే 'సైనా' బయోపిక్‌?

Jan 29 2021 1:15 PM | Updated on Jan 29 2021 2:35 PM

Will Parineeti Chopras Saina Nehwal Biopic Have an OTT Release? - Sakshi

కరోనా పుణ్యమా అని ఓటీటీలకు డిమాండ్‌ బాగానే పెరిగింది. ప్రస్తుతం థియేటర్లలో  50% ఆక్యుపెన్సీ రేటు మాత్రమే ఉండటంతో మేకర్స్‌ డిజిటల్‌ వైపు చూస్తున్నారు. తాజాగా బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తీసిన బయోపిక్‌ కూడా ఓటీటీలోనే రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది. ‘సైనా’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి పరిణీతీ చోప్రా నటించగా, అమోల్ గుప్తా దర్శకత్వం వహించారు. గతేడాది  వేసవిలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, లాక్‌డౌన్‌ కారణంగా రిలీజ్‌కు బ్రేక్‌ పడింది. (‘పుష‍్ప’ షూటింగ్‌లో విషాదం : షాక్‌లో అభిమానులు )

ప్రస్తుతం థియేటర్లలో ఆక్యుపెన్సీ రేటు కారణంగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేయడానికే నిర్మాతలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అప్‌డేట్‌ రానున్నట్లు తెలుస్తోంది కాగా సైనా పాత్రలో మొదట శ్రద్ధా కపూర్ నటించినా కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పించుకున్నారు. దీంతో ఆ అవకాశం పరిణితీకి దక్కింది. ఈ సినిమాలో సైనా పాత్ర కోసం పరిణీతి బ్యాడ్మింటన్‌ సాధన చేశారు. బ్యాడ్మింటన్‌లో మెళకువలన్నీ నేర్చకోవడంతోపాటు సైనా, ఆమె కుటుంబంతో సమయం గడిపారు పరిణీతి. (సన్నాఫ్‌ ఇండియా ఫస్ట్‌లుక్‌ విడుదల)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement