List of movies releasing on OTT platforms this week - Sakshi
Sakshi News home page

OTT Released Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే!

Apr 20 2023 3:59 PM | Updated on Apr 20 2023 4:46 PM

This Week OTT Released Movie List In all Platforms - Sakshi

ప్రస్తుతం సినిమాలు చూసేందుకు ఓటీటీలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్లకు వెళ్లలేని కొత్త సినిమాలు ఎప్పుడొస్తాయా ఆసక్తిగా కనబరుస్తున్నారు. అలాంటి వారికి వినోదం అందించేందుకు ఈ వారంలో కొత్త సినిమాలు రిలీజ్‌ అయ్యేందుకు రెడీ అయ్యాయి. వేసవి సెలవుల్లో మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు వస్తున్న చిత్రాలేవో ఓ లుక్కేద్దాం.  

 ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు

రాజేంద్ర ప్రసాద్‌, మీనా ప్రధాన పాత్రల్లో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన చిత్రం 'ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు'. ఈ చిత్రాన్ని కోనేరు కల్పన నిర్మించారు. సోహెల్‌, మృణాళిని జంటగా నటించిన ఈ చిత్రాన్ని కె.అచ్చిరెడ్డి సమర్పించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

వర్జిన్ స్టోరి
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘వర్జిన్ స్టోరి’. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. సౌమిక పాండియన్ హీరోయిన్‌గా నటించింది. ప్రదీప్ బి. అట్లూరి దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఈనెల 21 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. 

ఈ వారం ఓటీటీకి వస్తోన్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

జీ5

  • ఒరు కోడై మర్డర్‌ మిస్టరీ -తమిళ్‌- ఏప్రిల్‌ 21

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  •     డ్యాన్సింగ్‌ ఆన్‌ ది గ్రేవ్‌ -హిందీ -డాక్యుమెంటరీ సిరీస్‌-ఏప్రిల్‌ 21
  •     డెడ్‌ రింగర్స్‌- ఇంగ్లీష్‌- సిరీస్‌- సీజన్‌-1

నెట్‌ఫ్లిక్స్‌

  •     చోటా భీమ్‌ -సీజన్‌-17- ఏప్రిల్‌ 20
  •     టూత్‌పరి- హిందీ- ఏప్రిల్‌ 20
  •     డిప్లొమాట్‌-  ఇంగ్లీష్‌- ఏప్రిల్‌ 20
  •     సత్య2 - తెలుగు ఏప్రిల్‌ 21
  •     రెడీ -  తెలుగు ఏప్రిల్‌ 21
  •     ఇండియన్‌ మ్యాచ్‌ మేకింగ్‌- వెబ్‌సిరీస్‌- ఏప్రిల్‌ 21
  •     ఎ టూరిస్ట్స్‌ గైడ్‌ టు లవ్‌ -ఇంగ్లీష్‌- ఏప్రిల్‌ 21
  •     రఫ్‌ డైమండ్స్‌ - బెల్జియం ఏప్రిల్‌ 21
  •     వన్‌ మోర్‌ టైమ్‌ -స్వీడిష్‌- ఏప్రిల్‌ 21
  •     చోక్‌హోల్డ్‌ -టర్కిష్‌-ఏప్రిల్‌ 21

సోనీలివ్‌

  •     గర్మీ- సిరీస్‌

హాట్‌స్టార్‌

  •     కన్నా కానుమ్‌ కాళంగల్‌- తమిళ్‌ -సీజన్‌-2 ఏప్రిల్‌ 21
  •     సుగా-  డాక్యుమెంటరీ స్పెషల్‌- ఏప్రిల్‌ 21

Advertisement
 
Advertisement
Advertisement