నౌ అండ్‌ ఫరెవర్‌.. ఐ లవ్‌ యూ సోహెల్‌ ఖత్తూరియా | Wedding bells for Hansika Motwani | Sakshi
Sakshi News home page

నౌ అండ్‌ ఫరెవర్‌.. ఐ లవ్‌ యూ సోహెల్‌ ఖత్తూరియా

Nov 3 2022 7:02 AM | Updated on Nov 3 2022 7:02 AM

Wedding bells for Hansika Motwani - Sakshi

నటి హన్సిక మరోసారి వార్తల్లో కెక్కింది. ఇంతకుముందు సినిమాకు సంబంధించిన వార్తలతోనూ, వదంతులతోనూ వార్తల్లో నానిన  ఈ ముంబయి బ్యూటీ ఇప్పుడు వ్యక్తిగత విషయంతో తనే స్వయంగా వార్తల్లోకి వచ్చింది. తెలుగు, తమిళం భాషల్లో క్రేజీ కథానాయికగా రాణిస్తున్న హన్సిక మత్వాని ఈ రెండు భాషల్లోనూ ప్రముఖ నటులతో జతకట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మొదట్లో బొద్దుగా..ముద్దుగా కనిపించిన హన్సిక ఆ తరువాత వర్కౌట్‌ చేసి స్లిమ్‌గా తయారైంది. ఈ చిన్నది చిక్కినా చక్కగానే ఉందంటూ దర్శక, నిర్మాతలు ఇప్పటికీ అవకాశాలు కల్పిస్తూ్తనే ఉన్నారు. అలా 50 చిత్రాలను అవలీలగా పూర్తి చేసిన ఈ అమ్మడికి ఇప్పట్లో చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. ఆ మధ్య నటుడు శింబుతో ప్రేమాయణం జరిపిన హన్సిక ఆయనతో పెళ్లిపీటల వరకు వెళ్లాలని భావించింది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు కారణంగా బ్రేకప్‌ అయ్యింది. అయిననూ పక్కా ప్రొఫషనలిస్ట్‌ అయిన హన్సిక తన 50వ మహా చిత్రంలో మాజీ ప్రియుడు శింబుతో రొమాన్స్‌ చేసింది.

ఆ తరువాత పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు నేను సంతోషంగానే ఉన్నాగా ఇప్పుడు పెళ్లి అవసరమా? అంటూ ఎదురు  ప్రశ్న వేసింది. అలాంటిది అనూహ్యంగా ఇటీవల నటి హన్సిక ప్రేమ, పెళ్లి గురించి వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అది చాలా స్పెషల్‌గా, రొమాంటిక్‌గా ఈ అమ్మడు వ్యాపారవేత్త సోహైల్‌ ఖత్తూరియా అనే వ్యక్తితో చాలాకాలంగా లవ్‌లో ఉన్నట్లు సమాచారం. వీటిపై ఎలాంటి స్పందన  వ్యక్తం చేయని హన్సిక బుధవారం తన ప్రియుడు గురించి ఒక్కసారిగా బ్లో అప్‌ అయ్యింది.

ఈ క్రమంలోనే బుధవారం ప్యారిస్‌ నగరంలోని ఈఫిల్‌ టవర్‌ వద్ద మతాబుల వెలుగుల మధ్య అందమైన పువ్వులతో ముస్తాబు చేసిన లవ్‌ సింబల్‌ మధ్య తన కాబోయే జీవిత భాగస్వామితో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ప్రియుడు మోకాలుపై నిలబడి హన్సిక చేతిని పట్టుకోగా ఆమె ప్రేమైక వదనంతో చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యాన్ని పొందుపరిచారు. అందులో ఐ లవ్‌ యూ సోహెల్‌ ఖత్తూరియా, నౌ ఫరెవర్‌ అని పేర్కొంది. అలా తన ప్రియుడిని పరిచయం చేసి వదంతులకు పుల్‌స్టాప్‌ పెట్టింది. కాగా వీరి పెళ్లి డిసెంబర్‌ 4వ తేదీన రాజస్థాన రాష్ట్రం జైపూర్‌ నగరంలోని ప్రాచీన ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇద్దరి కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement