ఫర్‌ఫెక్ట్‌ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌.. 'వి లవ్ బ్యాడ్ బాయ్స్'! | Sakshi
Sakshi News home page

We Love Bad Boys: ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'వి లవ్ బ్యాడ్ బాయ్స్'!

Published Wed, Feb 14 2024 12:40 PM

We Love Bad Boys First Look Poster Released On Valentines Day - Sakshi

రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌ 'వి లవ్ బ్యాడ్ బాయ్స్". ఫుల్ కామెడీ చిత్రంగా వస్తోన్న ఈ చిత్రాన్ని నూతన నిర్మాణ సంస్ధ బీఎమ్ క్రియేషన్స్ పతాకంపై పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. ఇవాళ వాలెంటైన్‌ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్, సన్యు దవలగర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ సందర్భంగా డెరెక్టర్‌ రాజు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగినట్లుగానే  కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. ఈ చిత్రం తమకు శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత పప్పుల కనక దుర్గారావు అన్నారు. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా.. పోసాని కష్ణమురళి, కాశి విశ్వనాథ్, అలి, సప్తగిరి, పృథ్వి, శివారెడ్డి, భద్రం, గీతాసింగ్  ముఖ్య పాత్రలు పోషించారు.

Advertisement
Advertisement