పొంగల్ పోటీలో చిరు, బాలయ్య.. ఇద్దరిది ఒకే​ స్టోరీ! | Waltair Veerayya Vs Veera Simha Reddy: Chiranjeevi, Balakrishna In Pongal War With Revenge Story | Sakshi
Sakshi News home page

పొంగల్ పోటీలో చిరు, బాలయ్య.. ఇద్దరిది ఒకే​ స్టోరీ!

Jan 3 2023 12:54 PM | Updated on Jan 3 2023 1:20 PM

Waltair Veerayya Vs Veera Simha Reddy: Chiranjeevi, Balakrishna In Pongal War With Revenge Story - Sakshi

సంక్రాంతి పోటీలో చాలా సార్లే ప్రత్యర్తులుగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి,నందమూరి బాలకృష్ణ. ఒకసారి మెగా హీరో పై చేయి సాధిస్తే, మరోసారి నందమూరి కథానాయకుడు విజయం సాధించాడు. ఈ సంక్రాంతికి కూడా మరోసారి పోరుకు సై అంటున్నారు. ఒకరు బ్రదర్ తో పోటీ పడే  కథతో వస్తుంటే,మరొకరు..ఫాదర్‌తో తలపడే స్టోరీని ఎంచుకున్నారు.ఇలా ఈ ఇద్దరు స్టార్లు...పగ నేపథ్యంతో రంగంలోకి దిగతున్నారు.

వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవి..ప్రమోషన్ల జోరు చూపిస్తుంటే.నందమూరి నట సింహాం కూడా..పబ్లిసిటికి ముస్తాబు అయ్యాడు.ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అలాగే..ఈ రెండు చిత్రాల్లోనూ  శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి స్పెషల్ పాటలతో కూడా ఆకట్టుకోబోతున్నారు



వాల్తేరు వీరయ్యలో రవితేజ కూడా నటిస్తున్న మ్యాటర్ తెలిసిందే. వీరసింహా రెడ్డిలో బాలయ్య డ్యూయల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు రివేంజ్‌ స్టోరీలతో తెరకెక్కాయని సమాచారం. వాల్తేరు వీరయ్య లో చిరంజీవి, రవితేజ ప్రత్యర్థులుగా కనిపించబోతున్నట్టు సమాచారం. ఇక వీరసింహా రెడ్డిలో బాలయ్యకు ఆయన కొడుకుకు మధ్య సాగే రివేంజ్‌ను చూపించబోతున్నారట. జనవరి 12 న వీరసింహా రెడ్డి రిలీజ్‌ అవుతుంటే, జనవరి 13 న వాల్తేరు వీరయ్య రంగంలోకి దిగుతున్నాడు. మరి ఈ పొంగల్‌ పోటీలు ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement