‘లవ్‌ యూ రామ్‌’లో స్ఫూర్తి, సందేశం రెండూ ఉన్నాయి | Sakshi
Sakshi News home page

‘లవ్‌ యూ రామ్‌’లో స్ఫూర్తి, సందేశం రెండూ ఉన్నాయి

Published Sun, Dec 4 2022 10:08 AM

VV Vinayak Talk About Love You Ram Movie - Sakshi

రోహిత్‌ బెహల్‌, అపర్ణ జనార్ధన్‌ జంటగా నటించిన చిత్రం‘లవ్‌ యూ రామ్‌’. దర్శకుడు దశరథ్‌ కథ అందించిన ఈ సినిమాకు డీవై చౌదరి దర్శకత్వం వహించారు. దశరథ్‌, డీవై చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసిన దర్శకుడు వీవీ వినాయక్‌ మాట్లాడుతూ.. ‘దశరత్‌ నాకు మంచి మిత్రుడు. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న డీవై చౌదరి దర్శకత్వంలో వస్తున్న ఈ తొలి సినిమా విజయం సాధించాలి’ అన్నారు.

‘నా పాతికేళ్ల మిత్రుడు చౌదరితో కలిసి ఈ సినిమా చేయడం హ్యాపీ’అన్నారు కే. దశరథ్‌. ‘ఈ తరానికి కావాల్సిన సందేశం, స్పూర్తి ఈ సినిమాలో ఉన్నాయి’ అన్నారు డీవై చౌదరి. ‘ఈ సినిమా నాకు స్పెషల్‌’ అన్నారు రోహిత్‌. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: సుధాకర్‌ బొర్రా, డి. నేగేశ్వర్‌రావు. 

Advertisement
 
Advertisement