VV Vinayak: హీరోయిన్‌ లయను బాలయ్య చెల్లెలి పాత్రకు అడిగితే ఏడ్చేసింది

VV Vinayak Said Heroine Laya Cries When Offer Sister Role In Chennakesava Reddy - Sakshi

హీరోయిజానికి ఫ్యాక్షనిజం యాడ్‌ చేస్తూ బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టిన డైరెక్టర్‌ వీవీ వినాయక్‌. తొలి సినిమా ఆదితోనే పవర్‌ఫుల్‌ హిట్‌ అందుకున్నాడాయన. ఆ వెంటనే బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి సినిమా తీసి మరో హిట్‌ కొట్టాడు. అయితే ఇందులో టబు పాత్రకు సౌందర్యను, దేవయాని పాత్రకు లయను అనుకున్నట్లు చెప్పాడు. 

ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'టబు పాత్రకు సౌందర్యను అడిగాను. అయితే ఆమె ఓల్డ్‌ పాత్ర అప్పుడే వద్దని తిరస్కరించింది. టబును అడగ్గానే ఆమె ఒప్పేసుకుంది. దేవయాని పాత్రకు స్వయంవరం హీరోయిన్‌ లయను అడిగాను. ఆమె వెంటనే కళ్లనీళ్లు పెట్టుకుంది. చెల్లెలి పాత్రకే ఎందుకు అడుగుతారు? తెలుగమ్మాయిలు హీరోయిన్‌గా పని చేయరా? అని ఏడ్చేసింది. మీ ముఖం అమాయకత్వంగా ఉంది కాబట్టి ఈ రోల్‌ కోసం అడిగానని చెప్పాను. కానీ ఆమె మాత్రం ఎందుకండీ అలా చూస్తారు? హీరోయిన్‌గా ఎందుకివ్వరు? అని ప్రశ్నించింది. నేను సారీ చెప్పి వచ్చేశా. తర్వాత దేవయానిని అడగ్గానే ఒప్పుకుంది. సినిమాలో తల్లి, చెల్లెలి పాత్రలు సెలక్ట్‌ చేసుకోవడం చాలా కష్టం' అని చెప్పుకొచ్చాడు వినాయక్‌.

చదవండి: నయనతారకు వాంతులు, ఎనీ గుడ్‌న్యూస్‌ అంటున్న ఫ్యాన్స్‌!
చై టాటూకి, సమంతతో ఉన్న కనెక్షన్‌ ఏంటో తెలుసా?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top