ఒకేసారి రెండు సినిమాలు గొప్ప విషయం: వీవీ వినాయక్‌ | VV Vinayak Appreciates Producer GV Naidu | Sakshi
Sakshi News home page

VV Vinayak: ఒకేసారి రెండు సినిమాలు గొప్ప విషయం

Jan 24 2022 9:59 AM | Updated on Jan 24 2022 9:59 AM

VV Vinayak Appreciates Producer GV Naidu - Sakshi

మరో చిత్రానికి ‘యూజ్‌ఫుల్‌ ఫెలోస్‌’ అనే టైటిల్‌ పెట్టారు.  ఈ రెండు చిత్రాల ముహూర్తపు సన్నివేశాలకు దర్శకుడు వీవీ వినాయక్‌ క్లాప్‌ ఇచ్చారు..

‘‘ఒకేసారి రెండు సినిమాలను నిర్మిస్తూ ఇద్దరు దర్శకులకు అవకాశం ఇవ్వడం అనేది గొప్ప విషయం. జీవీ నాయుడు నిర్మిస్తున్న ఈ రెండు చిత్రాలు గొప్ప విజయాలు సాధించాలి’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్‌. వీఆర్‌జీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై గొంగటి వీరాంజనేయ నాయుడు నిర్మిస్తున్న రెండు సినిమాల ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. వీఆర్‌జీఆర్‌ ప్రొడక్షన్స్‌లో తొలి సినిమాగా ఫిల్మీ గ్యాంగ్‌స్టర్స్‌ దర్శకత్వంలో ఓ హారర్‌ సినిమాను గొంగటి వీరాంజనేయ నాయుడు (జీవీ నాయుడు) నిర్మించనున్నారు.

అలాగే మహేశ్‌ గంగిమళ్ల దర్శకత్వంలో జీవీ నాయుడు నిర్మిస్తున్న మరో చిత్రానికి ‘యూజ్‌ఫుల్‌ ఫెలోస్‌’ అనే టైటిల్‌ పెట్టారు.  ఈ రెండు చిత్రాల ముహూర్తపు సన్నివేశాలకు దర్శకుడు వీవీ వినాయక్‌ క్లాప్‌ ఇచ్చారు. అడిషనల్‌ సెక్రటరీ కాళీ కుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, ఐఏఎస్‌ ఆఫీసర్‌ టి. చిరంజీవులు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఈ రెండు చిత్రాలతో కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు జీవీ నాయుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement