
కుటుంబ గొడవలతో ముంచు ఫ్యామిలీ పరువు రోడ్డునపడింది. విష్ణు (Vishnu Manchu)- మనోజ్ (Manoj Manchu)కు మధ్య సఖ్యత కుదరట్లేదు అనుకుంటే.. మనోజ్- మోహన్‌బాబు మధ్య కూడా గొడవలు జరగడం అభిమానులనే కాదు ఇండస్ట్రీని సైతం షాక్‌కు గురి చేసింది. ఇలా వీరింట్లో ఏదో ఒకరకంగా తగవులాడుతూనే ఉన్నారు. ఈ రచ్చ వల్ల తన పిల్లలు ఇబ్బందిపడుతున్నారంటోంది మంచు మోహన్‌బాబు పెద్ద కోడలు, విష్ణు సతీమణి విరానిక (Viranica Manchu).
ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతాయి
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె కుటుంబ కలహాలపై స్పందించింది. విరానిక మాట్లాడుతూ.. కుటుంబమన్నాక గొడవలు అవుతూనే ఉంటుంది. కేవలం మా ఫ్యామిలీ అనే కాదు ప్రతి ఇంట్లోనూ జరుగుతాయి. కానీ చాలావరకు బయటకు రావు. దురదృష్టవశాత్తూ మా కుటుంబంలోని గొడవలు బయటకువచ్చాయి. దానికి మనమేం చేయలేం. నాకు నా పిల్లలు ముఖ్యం. వారికోసం ఏదైనా భరిస్తాను. ఒక స్పాంజిలా అన్నింటినీ ఓపికగా స్వీకరిస్తాను. పిల్లలకన్నా నాకెవరూ ముఖ్యం కాదు. కానీ జరుగుతున్న రచ్చ వల్ల నాకన్నా నా పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. భయపడిపోతున్నారు.
నాలుగో ప్రెగ్నెన్సీపై ట్రోలింగ్
అసలేం జరుగుతుంది? తాతయ్యకేమైనా అవుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. అందుకే పిల్లల్ని.. వివాదాలకు చాలా దూరంగా ఉంచుతాను. నేను ధైర్యంగా ఉంటేనే వారికి ఎంతోకొంత ధైర్యం చెప్పగలను అని విరానిక చెప్పుకొచ్చింది. అలాగే తను నాలుగోసారి గర్భం దాల్చినప్పుడు కూడా చాలామంది ట్రోల్ చేశారంది. మీకేం పని లేదా? అంటూ నోటికొచ్చినట్లు తిట్టారని బాధపడింది. విష్ణుకు, తనకు పిల్లలంటే ఇష్టమని.. అందుకే నలుగుర్ని కన్నామని విరానిక పేర్కొంది.
చదవండి: అర్ధరాత్రి ఫోన్.. నన్ను తీసేసి ఓ శునకాన్ని పెట్టుకున్నారు.. హర్టయిన శోభిత