మరోమారు పెద్దమనసు చాటుకున్న విశాల్‌.. వారందరికీ బంగారు చైన్లు 

Vishal Presented gold Chains to 11 underprivileged couples married - Sakshi

సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న తన అభిమాన సంఘాల నిర్వాహకులను ప్రోత్సహించేలా నటుడు విశాల్, వారికి బంగా రు చైన్లు బహూకరించారు. విశాల్‌ ప్రజా సంక్షేమ సంఘం తరఫున రాష్ట్రవ్యాప్తంగా నిర్వాహకులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వి షయం తెలిసిందే.

అందులో భాగంగా ఇటీవల స్థానిక మాధవరంలో తిరువళ్లూరు జిల్లాకు చెందిన విశాల్‌ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు కన్నన్, చెన్నై విశాల్‌ ప్రజా సంఘం ప్రజాసంక్షేమ సంఘం కార్యదర్శి హరికుమార్‌ ఆధ్వర్యంలో 11 పేద జంటల ఉచిత వివాహం జరిపించారు.  కాగా ఇలా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తన సంఘం జిల్లా అధ్యక్షులను మరింత ప్రోత్సహించేలా నటుడు విశాల్‌ వారికి బంగారు చైన్లను బహూకరించా రు.

బుధవారం చెన్నైలో జరిగిన ఈ వేడుకల్లో తిరువళ్లూరు జిల్లా విశాల్‌ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు కన్నన్, చెన్నై జిల్లా అధ్యక్షుడు రాబర్ట్, యువజన విభాగం అధ్యక్షుడు గురువాయూర్, ఉత్తర చెన్నై సంఘం అధ్యక్షుడు శీ ను, రాయపురం సంఘం అధ్యక్షుడు అన్బు, జి ల్లా కార్యదర్శి యువరాజ్‌ తదితరులకు విశాల్‌ బంగారు చైన్లను కానుకగా ఇచ్చారు. అంతకుముందు విశాల్‌ ప్రజా సంక్షేమ సంఘాల నిర్వాహకులు ఆయన్ని సత్కరించారు.  

చదవండి: (విశాల్‌తో ప్రేమలో నటి అభినయ.. త్వరలో పెళ్లి కూడా?)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top