విశాల్‌తో ప్రేమలో నటి అభినయ.. త్వరలో పెళ్లి కూడా?

Vishal getting married to this popular actress? - Sakshi

నటుడు, నిర్మాతగా బిజీగా ఉన్నా విశాల్‌పై తాజాగా ఒక వదంతి సామాజిక మాధ్యమాల్లో దొర్లుతుంది. అయితే ఇలాంటి వదంతులు ఆయనకు కొత్తేమీ కాదు. స్టార్‌ హీరోగా రాణిస్తున్న విశాల్‌ చిత్ర పరిశ్రమకు చెందిన సంఘాల్లోనూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇకపోతే విశాల్‌ ఇప్పటికీ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అన్నది తెలిసిందే.

ఇంతకు ముందు నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌తో ప్రేమ వ్యవహారం అంటూ ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత ఈయనకు హైదరాబాద్‌కు చెందిన యువతితో వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే  కారణాలేమైనా ఆ పెళ్లి ఆగిపోయింది. ప్రస్తుతం విశాల్‌ నటనపైనే పూర్తి దృష్టి సారించారు. అలాంటిది నటి అభినయతో ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఈ ప్రచారంపై విశాల్‌ స్పందించలేదు కానీ, నటి అభినయ మాత్రం ఖండించారు. నాడోడిగల్‌ చిత్రంతో నటిగా పరిచయమైన నటి అభినయ మూగ, చెవిటి యువతి అన్న విషయం తెలిసిందే. అయితే ఆ కొరతలను జయించి నటిగా రాణిస్తున్నారు. విశాల్‌తో ప్రేమ అనే ప్రచారం గురించి అభినయ స్పందిస్తూ తాను ప్రస్తుతం విశాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న మార్క్‌ ఆంటోనీ చిత్రంలో  ఆయనకు భార్యగా నటిస్తున్నానని చెప్పారు. రీల్‌ లైఫ్‌లో భార్యగా నటిస్తే రియల్‌ లైఫ్‌లో భార్య కాగలమా? అంటూ ప్రశ్నించారు. దీంతో విశాల్‌ అభినయల మధ్య ప్రేమ అనే వదంతులకు పుల్‌స్టాప్‌ పడినట్టు అయింది.    

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top