‘జాతిరత్నాల’మధ్య చిచ్చు... నవీన్‌, దర్శిలకు రాహుల్ వార్నింగ్

Viral Video: Rahul Ramakrishna Funny Warning To Naveen Polishetty And Priyadarshi - Sakshi

కేవీ అనుదీప్‌ దర్శకత్వంలో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం జాతిరత్నాలు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ  జాతిరత్నాలు 20 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చారు. భారీ లాభాలు రావడంతో సక్సెన్ టూర్‌ని కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సక్సెస్‌ టూర్‌లో భాగంగా నవీన్‌, ప్రియదర్శి అమెరికాకు వెళ్లారు. అక్కడ మూడు రోజుల పాటు అన్ని చోట్ల తిరుగుతున్నారు. వారి ప్రయాణంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్లను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు.

ప్రస్తుతం నవీన్‌, ప్రియదర్శి అమెరికా టూర్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ వీడియోలు చూసిన రాహుల్‌ రామకృష్ణ.. తనను అమెరికా తీసుకెళ్లకుండా మోసం చేశారంటూ.. ప్రియదర్శి, నవీన్‌లకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. అరేయ్‌ దర్శి, నవీన్‌.. పీపుల్స్‌ ప్లాజాలో సక్సెస్‌మీట్ అయ్యాక.. మిమ్మల్ని కలిసేలోపే పాస్‌పోర్ట్‌తో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి.. విమానమెక్కి యూఎస్‌ వెళ్లిపోతారేరా.! నేను చెప్పా కదరా.. నా దగ్గర కూడా పాన్‌ కార్డ్‌ ఉందని. పాన్‌కార్డు చూపిస్తే అక్కడ ఎంట్రీ ఇస్తార్రా..! జోగిపేట రవిరా నేను. నా వల్లే ప్రాబ్లమ్‌ అవుతుందని నన్ను వదిలేసి వెళ్లిపోయారు కదరా! మీరు రండ్రా మీ సంగతి చెబుతా..!’అంటూ ఓ సరదా వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు రాహుల్‌. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top