తంగలాన్ భామ స్పెషల్ లుక్.. బంగారు వర్ణంతో మెరిసిన భామ! | Sakshi
Sakshi News home page

Malavika Mohanan: తంగలాన్ భామ మాళవిక మోహనన్.. బంగారు వర్ణంతో మెరిసిన భామ!

Published Thu, Mar 21 2024 2:58 PM

Vikram Movie Thangalaan Heroine Malavika Mohanan Post Goes Viral - Sakshi

సినీ కుటుంబం నుంచి వచ్చిన మలయాళ భామ మాళవిక మోహనన్‌. మొదట్లో మాతృభాషలో నటించిన ముద్దుగుమ్మ.. ఆ తరువాత పేట చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైంది. పేట చిత్రంలో రజనీకాంత్‌ మిత్రుడు శశికుమార్‌ భార్యగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత విజయ్‌ సరసన మాస్టర్‌ చిత్రంలో నటించారు. అందులో పాత్ర పరిమితే అయినా, హిట్‌ చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్నారు. 

ఆ తరువాత ధనుశ్‌కు జంటగా మారన్‌ చిత్రంలో నటించారు. ఆ చిత్రం కరోనా కాలంలో ఓటీటీలో స్ట్రీమింగ్‌ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. మరోపక్క మలయాళం, తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ బహు భాషా నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా తాజాగా పా.రంజిత్‌ దర్శకత్వంలో విక్రమ్‌కు జంటగా తంగలాన్‌ చిత్రంలో నటించారు. ఇందులో గిరిజన అమ్మాయి పాత్రలో నటించడం విశేషం. దీంతో తంగలాన్‌ చిత్రంపై అభిమానుల్లో చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఈ సినిమా సమ్మర్‌ స్పెషల్‌గా తెరపైకి రావలసిన ఈ చిత్రం ఎన్నికల కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. కాగా ఈమె నటించిన చిత్రాల విడుదల ఆలస్యమైనప్పటికీ.. ఈ బ్యూటీ మాత్రం అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తరచు ప్రత్యేక ఫొటో షూట్‌ చేసుకుంటూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తోంది. అదే విధంగా తాజాగా 24 క్యారెట్ల బంగారంలా మెరిసి పోయే దుస్తులు ధరించి స్పెషల్‌ ఫొటో షూట్‌ చేసుకున్న ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement