Vikram Makeover In 'Thangalaan' Movie - Sakshi
Sakshi News home page

Vikram: తంగలాన్‌ షూటింగ్‌లో గాయాలు.. కోలుకున్న విక్రమ్‌

Published Wed, Jun 7 2023 10:06 AM | Last Updated on Wed, Jun 7 2023 10:21 AM

Vikram Makeover In Thangalaan Movie - Sakshi

ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయగా విక్రమ్‌ గెటప్‌ అబ్బుర పరిచింది. వైవిధ్యభరిత కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన పా.రంజిత్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఇది. మాళవిక మోహన్‌, పార్వతి, పశుపతి, ఇంగ్లండ్‌ నటుడు డేనియల్‌ కాల్టకిరోన్‌ త

పాత్రలకు ప్రాణం పోయడానికి ముందు నటులు వాటిలో ఒదిగిపోవాలి. అలా మేకోవర్‌ అవ్వడంలో ఇప్పుడున్న నటుల్లో కమల్‌ హాసన్‌ తరువాత స్థానం విక్రమ్‌దే అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇంతకు ముందు అన్నియన్‌, ఐ వంటి చిత్రాలలో ఆయన శారీరక భాషే ఇందుకు చిన్న నిదర్శనం. తాజాగా అంతకు మించి అన్నట్లుగా తంగలాన్‌ చిత్రం కోసం విక్రమ్‌ మేకోవర్‌ అయ్యారు. ఈ చిత్రంలో ఆయన గెటప్‌ చూస్తే ఎవరైనా ఈయన విక్రమ్‌ అని చెబితే తప్ప గుర్తు పట్టనంతగా మారిపోయారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయగా విక్రమ్‌ గెటప్‌ అబ్బుర పరిచింది. వైవిధ్యభరిత కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన పా.రంజిత్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఇది. మాళవిక మోహన్‌, పార్వతి, పశుపతి, ఇంగ్లండ్‌ నటుడు డేనియల్‌ కాల్టకిరోన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చాలా వరకు పూర్తి చేసుకుంది. కాగా ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ కోసం రిహార్సల్స్‌ చేస్తుండగా విక్రమ్‌ ప్రమాదానికి గురయ్యారు.

ఆసుపత్రిలో చేరి చికిత్స చేసుకున్నారు. ఆ సమయంలో తంగలాన్‌ చిత్ర షూటింగ్‌ను కూడా రద్దు చేశారు. తాజాగా విక్రమ్‌ పూర్తిగా రీచార్జ్‌ అయ్యారు. దీంతో తంగలాన్‌ చిత్రం షూటింగ్‌ను ఈ నెల 15వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించడానికి యూనిట్‌ వర్గాలు రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. మరో 12 రోజులు షూటింగ్‌ చేస్తే తంగలాన్‌ పూర్తి అవుతుందని తెలిసింది. ఇది కోలార్‌ బంగారు గనులను రూపొందించడానికి ముందు ఈ ప్రాంతంలోని ప్రజలు బంగారాన్ని తవ్వుకుని తీసుకెళ్లే ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రమని తెలుస్తోంది.

చదవండి: పెళ్లి తిరుపతిలోనే చేసుకుంటా: ప్రభాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement