Vikram Mahaan Movie : మనం పెట్టిందే చట్టం.. ఆసక్తిగా 'మహాన్'​ టీజర్​

Vikram Mahaan Movie Teaser Released - Sakshi

Vikram Mahaan Movie Teaser Released: విభిన్నమైన కథలతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించే హీరో చియాన్​ విక్రమ్​. మోస్ట్​ ఛాలెంజింగ్ రోల్స్​ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విక్రమ్​ అతని కుమారుడు ధృవ్ విక్రమ్​తో కలిసి నటిస్తున్న చిత్రం 'మహాన్'​. ఎస్​ఎస్​ లలిత్​ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్​ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగు టీజర్​ను సోమవారం విడుదల చేశారు మేకర్స్​. విక్రమ్​ గాంధీ మహాన్​గా కనిపిస్తున్న ఈ చిత్రం నాటు సారా నేపథ్యంలో సాగనుంది. 

నాటు సారాకు వ్యతిరేకంగా, గాంధీ బాటలో నడుస్తానని తన తండ్రికి మాట ఇచ్చిన మహాన్​ అదే మద్యానికి బానిస అవడం వంటి సన్నివేశాలను టీజర్​లో చూపించారు. టీజర్​లో విక్రమ్​ నటన అదిరిపోయిందనే చెప్పవచ్చు. 'ఏపీలో ఎవడు బార్​ని లీజుకు తీసుకున్నా సరే వాడు మన సిండికేట్​ మనిషై ఉండాలి. మనం పెట్టిందే చట్టం' అనే డైలాగ్​ ఆకట్టుకుంది. అలాగే ఇందులో విక్రమ్ కుమారుడు ధృవ్​ విక్రమ్​ది మంచి ప్రభావం ఉన్న పాత్రలా ఉంది. టీజర్​ చివర్లో ధృవ్​ ఎంట్రీ ఆసక్తిరేకెత్తించేలా ఉంది. ఈ సినిమాను ఫిబ్రవరి 10న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్​ ప్రైమ్​లో నేరుగా విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top