పాన్‌ ఇండియా మూవీగా విజయ్‌ శంకేశ్వర్‌ బయోపిక్‌, టీజర్‌ అవుట్‌ | Vijay Sankeshwar Biopic Vijayanand Teaser Released | Sakshi
Sakshi News home page

Vijayanand Movie Teaser: పాన్‌ ఇండియా మూవీగా విజయ్‌ శంకేశ్వర్‌ బయోపిక్‌, టీజర్‌ అవుట్‌

Aug 3 2022 9:35 AM | Updated on Aug 3 2022 9:35 AM

Vijay Sankeshwar Biopic Vijayanand Teaser Released - Sakshi

సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి, వీఆర్‌ఎల్‌ అనే లాజిస్టిక్‌ కంపెనీకి అధినేతగా ఎదిగిన  డా. విజయ్‌ శంకేశ్వర్‌ జీవితం వెండితెరపైకి రానుంది. ‘విజయానంద్‌’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘ట్రంక్‌’ మూవీ ఫేమ్‌ రిషికా శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్‌ శంకేశ్వర్‌ పాత్రలో నిహాల్‌ నటిస్తున్నారు. ఆనంద్‌ శంకేశ్వర్‌ సమర్పణలో వి.ఆర్‌.ఎల్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు.

చదవండి: డ్రెస్సింగ్‌పై ట్రోల్‌.. తనదైన స్టైల్లో నెటిజన్‌ నోరుమూయించిన బిందు

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. విజయ్‌ శంకేశ్వర్‌ సొంత తెలివితేటలతో లారీల వ్యాపారంలోకి ప్రవేశించి ఎలా సక్సెస్‌ అయ్యారు? అనేది టీజర్‌లో చూపించారు. అనంత్‌ నాగ్, వినయ ప్రసాద్, వి. రవిచంద్రన్‌, ప్రకాష్‌ బెలవాడి, అనీష్‌ కురివిల్లా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం దర్శకుడిగా పనిచేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement