Vijay Raja Veyi Subhamulu Kalugu Neeku Gets Overwhelming Response On Aha - Sakshi
Sakshi News home page

Veyi Subhamulu Kalugu Neeku: 'వేయి శుభములు కలుగు నీకు'.. ఆహాలో అదిరిపోయే రెస్పాన్స్‌

Published Fri, Mar 10 2023 7:31 PM

Vijay Raja Veyi Subhamulu Kalugu Neeku Gets Overwhelming Response On Aha - Sakshi

శివాజీ రాజా తనయుడిగా 'వేయి శుభములు కలుగు నీకు' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్ రాజా. జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకంపై రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. విజయ్ రాజాకు జోడిగా తమన్నా వ్యాస్ నటించారు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. థియేటర్లలో అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో సినీ ప్రియులను అలరిస్తోంది. 

లవ్, కామెడీ, హారర్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రంలో విజయ్ రాజా నటన మెప్పిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే  ఓటీటీ ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకుంటోంది. మిలియన్ల వ్యూస్‌తో ఆహాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో మాస్టర్ జయదేవ్‌, శివాజీ రాజా, ఢీ ఫేం ఫాల్గుణి,  సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, అపూర్వ, మీనా, అనంత్, షాయాజి షిండే,  శ్రీకాంత్ అయంగార్, రోహిణి, జబర్దస్త్  అప్ప రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, కోట యశ్వంత్ ముఖ్య పాత్రలు పోషించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement