విజయ్‌ చివరి సినిమా.. రిలీజ్‌ కానట్లేనా? | Vijay Jana Nayagan Movie Latest Update | Sakshi
Sakshi News home page

విజయ్‌ చివరి సినిమా.. రిలీజ్‌ కానట్లేనా?

Jun 6 2026 8:23 AM | Updated on Jun 6 2026 8:51 AM

Vijay Jana Nayagan Movie Latest Update

విజయ్‌ ముఖ్యమంత్రి కాకముందు నటించిన చివరి చిత్రం జననాయకన్‌. పూజాహెగ్డే నాయకిగా నటించిన ఇందులో మమిత బైజు కీలక పాత్రను పోషించారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో కేవీ ఎన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్‌ చిత్రం జననాయకన్‌. ఈ చిత్రం జనవరి 9వ తేదీన విడుదల కావలసి ఉంది. అయితే సెన్సార్‌ సమస్యల కారణంగా విడుదల కాలేదు. కారణాలేమైనా ఆ చిత్రం చిక్కు ముడి వీడలేదు. 

విజయ్‌ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దీంతో జననాయకన్‌ చిత్రానికి మంచి రోజులు వస్తాయని అందరూ భావించారు. చిత్ర నిర్మాత కూడా జననాయకన్‌ చిత్రం త్వరలో తెరపైకి రానుంది అని మీడియాకు తెలిపారు. 

ఇలాంటి పరిస్థితుల్లో చిత్రానికి ఇప్పటి వరకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ రాలేదు సరికదా, చిత్రం ఇంటర్నెట్లో అనధికారికంగా విడుదలై తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీ సంస్థ చిత్ర ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో సమస్య మరింత జటిలమైంది. మరోపక్క జననాయకన్‌ చిత్రం వ్యవహారంలో ముఖ్యమంత్రి విజయ్‌ని మౌనం పాటించాల్సిదిగా కేంద్ర ప్రభుత్వం ఆ దేశించిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో చిత్ర డిస్ట్రిబ్యూటర్లలో నిర్లిప్తత నెల కొంది. 

ఈ విషయం ముఖ్యమంత్రి విజయ్‌ దృష్టికి వెళ్లిందని, ఆయన డిస్ట్రిబ్యూటర్ల వద్ద తీసుకున్న అడ్వాన్‌న్స్‌ను తిరిగి ఇచ్చేయాల్సిందిగా చెప్పినట్లు సమాచారం. అయితే ఆయన నిర్ణయం డిస్ట్రిబ్యూటర్‌లను సంతృప్తి పరుస్తుందా ? ఇక జననాయకన్‌ను తెరపై చూసే అవకా శం లేదా ? అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో జననాయకన్‌ చిత్రానికి దారేది అనే ప్రశ్న ఎదురవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement