‘ఫ్యామిలీ స్టార్‌’ ఎప్పుడొస్తున్నాడంటే.. | Vijay Deverakonda Family Star New Release Date to Clash | Sakshi
Sakshi News home page

‘ఫ్యామిలీ స్టార్‌’ ఎప్పుడొస్తున్నాడంటే..

Jan 27 2024 3:47 AM | Updated on Jan 27 2024 7:24 AM

Vijay Deverakonda Family Star New Release Date to Clash - Sakshi

‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా రిలీజ్‌ ఏప్రిల్‌ 5కు ఖరారైనట్లుగా తెలిసింది. హిట్‌ ఫిల్మ్‌ ‘గీతగోవిందం’ (2018) తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు పరశురామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఫిబ్రవరి 20 కల్లా పూర్తి కానుందని తెలిసింది. ఫిబ్రవరిలో ఓ పాటను విడుదల చేసి, ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఆరంభించాలనుకుంటున్నారు.

ఇక ఈ సినిమాను తొలుత సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కుదరకపోవడంతో మార్చిలో రిలీజ్‌కు ప్లాన్‌ చేశారు. ఫైనల్‌గా ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా రిలీజ్‌ డేట్‌ ఏప్రిల్‌ 5కు ఫిక్స్‌ అయినట్లుగా తెలుస్తోంది. అదే తేదీకి ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘దేవర’ విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ సినిమా విడుదల వాయిదా పడటంతో ఏప్రిల్‌ 5కి ‘ఫ్యామిలీ స్టార్‌’ రిలీజ్‌ని ఫిక్స్‌ చేశారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement