‘అర్జున్‌ రెడ్డి’ కాంబినేషన్‌ రిపీట్‌? | Vijay Devarakonda To Work Next With Sandeep Reddy Vanga | Sakshi
Sakshi News home page

‘అర్జున్‌ రెడ్డి’ కాంబినేషన్‌ రిపీట్‌?

Feb 10 2021 11:17 AM | Updated on Feb 10 2021 12:20 PM

Vijay Devarakonda To Work Next With Sandeep Reddy Vanga - Sakshi

విజయ్, సందీప్‌ కలిసి మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.

విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో 2017లో వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత విజయ్‌ కెరీర్‌ మరో లెవల్‌కి వెళ్లింది. సందీప్‌ అయితే ఏకంగా బాలీవుడ్‌కి వెళ్లి, ‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌ ‘కభీర్‌ సింగ్‌’ని తెరకెక్కించారు. ఇప్పుడు విజయ్, సందీప్‌ కలిసి మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ స్టోరీ లైన్‌ను కూడా రెడీ చేశారట సందీప్‌. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘లైగర్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు విజయ్‌. ‘లైగర్‌’ తర్వాత సుకుమార్, శివ నిర్వాణ దర్శకత్వాల్లో విజయ్‌ దేవరకొండ సినిమాలు చేయాల్సి ఉంది. ఇటు సందీప్‌ వంగా కూడా రణ్‌బీర్‌ కపూర్‌తో ‘యానీమల్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఈ ఇద్దరూ తమ పాజెక్ట్స్‌ను కంప్లీట్‌ చేసిన తర్వాత వీరి కాంబినేషన్‌ సినిమా ఆరంభమవుతుందని భోగట్టా.
చదవండి: నాగచైతన్య సాహసం.. ఆ పాత్రలో తొలిసారి
తలైవా తయార్‌!.. ఫ్యాన్స్‌ ఖుషీ

Advertisement
 
Advertisement
Advertisement